Posts

Showing posts from August, 2020

నిశ్శబ్దం బద్ధలైంది

                                "నిన్ను ప్రేమిస్తున్నా" "నీ మనసును ప్రేమిస్తున్నాను" "నిన్ను మనసారా ప్రేమిస్తున్నా" ''ఐలవ్యూ మధు" సూటిగా అతని కళ్లలోకి చూసింది మాధవి. " ఎలా చెప్పగలగుతున్నావ్ ? మనమింకా టీనేజ్ పిల్లలు అనుకున్నావా ? మీకు పెళ్లయింది. పిల్లలున్నారు. నాకూ పెట్టింది. ఇద్దరు పిల్లల తల్లిని, మీరు ప్రేమించినా నేనెలా ప్రేమిస్తాననుకున్నారు ? నేను నా భర్తను, పిల్లలను ప్రేమిస్తూ ఉన్నా" . ఆమె మాటలు విని నిశ్చేష్టుడయ్యాడు మురళి. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు గుటకలు మింగసాగాడు. తను అంత సూటిగా చెప్తుందనుకోలేదు. 'ఇంకెప్పుడూ ఇలా మాట్లాడకు" అంది మాధవి. కొంత కోపం, అసహనం ధ్వనించింది. ఆమె గొంతులో. కాసేపు మౌనం రాజ్యమేలింది. పక్షుల రెక్కల చప్పుడు వినిపించేంత నిశ్శబ్దం అలుముకుంది. వెంటనే తేరుకున్నాడు. చిరునవ్వు నవ్వుతూ... 'నువ్వు ఇంత సూటిగా చెస్తే ఎలా ? నువ్వు నాతో చనువుగా, నవ్వుతూ, తుళ్లుతూ మాట్లాడుతుంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనుకున్నా ?" అన్నాడు మురళీ.. 'ఆడది నవ్వితే, మాట్లాడితే చాలు ప్రేమిస్తూ ఉన్నట్లా ?...

ఆదర్శ రచయిత

        సెల్ ఫోన్ మ్రోగింది. ఎవరు ఫోన్ చేశారా అని సెల్ ఫోన్ లో పేరు కనబడగానే ఆత్రంగా మీట నొక్కాడు మాట్లాడటానికి.     "మీ అక్క మరణించింది", అటువైపునుంచి బాధతో చెప్తున్న తన చిన్ననాటి మిత్రుడు. “అరెరే! ఎంతపని జరిగింది. ముందుగా అనుకొన్నా. కానీ ఇంత తొందరగా ఇలా జరుగుతుందనుకోలేదు.” అన్నాడు కిశోర్. “ఇప్పుడే బయలుదేరుతున్నా. ఆఫీసులో లీవు తీసుకుని ఇప్పుడే బయలుదేరుతున్నా. నామేనల్లునికి ఫోన్ చేశారా? నేనే అందరికీ చేస్తాలే". అంటూ ఫోన్ కట్ చేశాడు కిశోర్.        కిశోర్ ఏది మాట్లాడినా ముక్తసరిగా ఉంటుంది. పైగా ఆయన కథా రచయిత కావడంవల్ల ఎప్పుడు ఎలా మాట్లాడాలో బాగా తెలుసు.         మాట్లాడినప్పుడల్లా బూతు మాటలు వస్తాయి. నోటిజిల. ఎవరైనా అట్లా మాట్లాడడం ఏమిటని అడిగితే అలవాటయిపోయిందని సమాదానం వస్తుంది.        బస్సు ఎక్కినాక అక్క గురించి ఆలోచనలు ముసురుకున్నాయి కిశోర్‌కు. బావమరణించాక అక్కే కుటుంబ బాధ్యతలన్నీ మోసింది. తనను చదివించింది. కొడుకునూ బాగా చదివించింది. మిషను కుట్టేది. చీరల వ్యాపారం చేసేది. ఎంతో పొదుపుగా సంసారం సా...

జ్వరం

                      “పాపకు జ్వరమొస్తావుంది-నువ్వు ఈ రోజు తొందరగా ఇంటికొచ్చేయ్, డాక్టరుకు చూపించాలి'      రజని ఫోన్ చేసింది భర్త రత్నంకు.           రత్నం స్కూలులో వున్నాడు. ఇంటినుంచి అరవై కిలోమీటరు దూరంలో వుండే పాలసముద్రం స్కూలులో పనిచేస్తున్నాడు.        'సరే' అన్నాడు. సాయంత్రం రాగానే పాప నుదుటిపై చేయి పెట్టి చూశాడు వళ్ళు కాలిపోతోంది. 'ఎలా తట్టు కుందో!' పైకి అనేశాడు. 'అందుకే మధ్యాహ్నంమంతా తడిబట్ట చుట్టాను పొట్టచుట్టూ' అంది రజని. అప్పుడే బట్ట ఆరిపోయి వుంది.       వెంటనే ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు డాక్టరు దగ్గరికి, పాప వయస్సు ఆరేళ్ళు. పాపను గట్టిగా పట్టుకుని భర్తవెనకాల జాగ్రత్తగా చూర్చుంది.       “జ్వరం ఎంతుంది డాక్టర్?" అడిగాడు రత్నం.      '102°', జ్వరమాని రీడింగ్ చూస్తూ అన్నాడు డాక్టరు. 'ఇంజెక్షన్ వేసేదా?'           “వద్దు సార్ ! ఫిట్స్ వస్తాయేమోనని భయం సార్."        "హైటెంపరేచర్ ఉన్...

ఏది కళాత్మకత? (కథ)

Image
                    ఆ రోజు ఆదివారమైనందునేమో రోడ్డుమీద జనం పలుచగా ఉన్నారు. వాహనాల రద్దీ కూడా పెద్దగా లేదు. నేను  నా మిత్రుడు జగదీష్ ఉదయాన్నే దగ్గర్లో ఉన్న రైల్వే క్యాంటీన్ లో టీ సేవిద్దామని గది నుంచి బయటకు వచ్చాము.          అప్పటికే వేసవి కావడం వల్ల సూర్యుడు తన తాపాన్ని ప్రదర్శించడం మొదలు పెట్టాడు. ఆ క్యాంటీన్ ఫర్లాంగు దూరంలో ఉంటుంది. గదికి తాళం వేసి బయటకు వస్తుండగా దూరంగా ఆకాశంలో మబ్బుల పై పడ్డ  సూర్యకాంతితో  శ్వేత వర్ణంతో మెరిసిపోతోంది. మా గదికి ఎదురుగా రోడ్డుకు ఆవలివైపున ఏపుగా పెరిగిన కొబ్బరి  చెట్టుపై సూర్యకాంతి ప్రతిఫలించి ఆకు పచ్చదనాన్ని శోభాయమానం చేస్తోంది.          జగదీష్ మంచి భావుకుడు పైగా  కళా ప్రియుడు. వీటిని చూడగానే జగదీష్ లోని భావుకత ఉప్పొంగి కవిత్వం చెప్పడం మొదలు పెట్టాడు. “అల్లనల్లన కుచ్చిళ్ళు ఎత్తిపట్టి సూర్యకాంతిలా నడచివచ్చే నా నెచ్చెలీ నాహృదయాన్ని పరచినాను నీ పాదాలచెంత" అంటూ అశువుగా నాకు వినిపించాడు. “అబ్బా! జగ్గూ! భలే వుందోయ్ నీ ...

నెరజాణ

Image
ఫ్లారెన్సునుంచి పారిస్‌ వెళ్లి స్థిరపడిన ఒక ధనికవర్తకుడికి లొడోవికో అనే కొడుకు వుండేవాడు. అతను ఫ్రెంచ్‌ రాజవంశీకుల పిల్లలతో కలిసి పెరగడం వలన కులీన సాంప్రదాయాలన్నీ బాగా నేర్చాడు. ఒకసారి వారి స్నేహితుల మధ్య లోకంలో అందరి కంటె ఎవరు అందగత్తె అనే చర్చ వచ్చింది. బొలోనాలో వున్న ఎగానో అనే పెద్ద వ్యాపారి భార్య మడోనాను మించిన సౌందర్యవతి లేదని చాలామంది అన్నారు. ఆ మాట నిజమో కాదో తెలుసుకోవాలన్న కోరిక దహించివేయగా లొడొవికో తండ్రితో ఏదో సాకు చెప్పి బొలోనా వెళ్లాడు. అదృష్టవశాత్తూ అతను వచ్చిన మూడో రోజునే ఒక విందు జరగడం, దానిలో ఆమెను చూడడం సంభవించింది. ఆమె ప్రేమను సంపాదించి తీరాలని, దానికై ఎంత కష్టానికైనా వెరవకూడదని నిశ్చయించుకున్నాడు. వాకబు చేయగా వాళ్ల యింట్లో పనివాడి అవసరం వుందని తెలిసింది. తను బస చేసిన పూటకూళ్లిల్లు యజమానితో ''నా పేరు ఎనోచినో. ఉద్యోగం కోసం యీ వూరు వచ్చాను. ఎగానో యింట్లో నౌకరు పని యిప్పించగలవా' అని అడిగాడు. ‘'మూడు రోజులుగా మీ ప్రవర్తన చూస్తున్నాను. ఎగానో వంటి కులీనుడి యింట్లో పనిచేయాలంటే నీలా మర్యాద, మప్పితం తెలిసున్నవాడే కావాలి, నేను సిఫార్సు చేస్తాను’' ...

మట్టిపెల్ల వాసన(కథ)

Image
                         అది కటారుపల్లె.       వేమన నడయాడిన పల్లె.        ఇప్పుడక్కడ వేమన సమాధి ఉంది.  సమాధి చుట్టూ వేమన చెప్పిన పద్యాలు గోడలపై చెక్కినారు. ఆయన సమాధి చూసేందుకు రోజూ ఎవరో ఒకరు వచ్చిపోతూంటారు. వేమనను గుర్తుచేసుకుంటూ ఉంటారు.                ఆరోజు ఓ స్కూలు బస్సు వచ్చి ఆగింది. బస్సులోంచి పిల్లలందరూ దిగుతున్నారు. “జాగ్రత్తగా దిగండి. అందరూ క్యూలో వేమన సమాధి దగ్గరకు వెళ్ళండి" సంధ్య టీచరు జాగ్రత్తలు చెపుతోంది.            పిల్లలందరూ క్యూలో లోపలికి వెళ్లారు. సమాధికి దగ్గర్లో ఉన్న ఇళ్ళలోని వాళ్ళు వచ్చి తొంగి చూస్తున్నారు. వాళ్ళలో ఒకాయన సంధ్య టీచరును గుర్తుపట్టినాడు.        “ఏమ్మా! సంధ్యా బాగున్నావా? ఊరువదిలాక ఊరునే మరచిపోయినావు కదమ్మా" అన్నాడు కామ్రేడ్ వెంకటరెడ్డి.           వెంకటరెడ్డి గతంలో కమ్యూనిస్టు పార్టీలో పనిచేసేవాడు. అందుకాయన్ను కామ్రే...

ఇద్దరమ్మాయిల కథ

Image
ఈ కధ ముప్పై అయిదేళ్ళ క్రితం 12 మార్చి 1982 న మాదాపూర్ అనే గ్రామం లో ఉత్తర ప్రదేశ్ లోని గౌండ జిల్లాలో మొదలయ్యింది.. క్రిమినల్స్ గురించి సమాచారం రావటం తో తన సబ్ అర్దినేట్స్ తో కలిసి DSP ఎస్.పి. సింగ్ రాత్రి వేళ హుటాహుటిన వెళ్ళాడు.అతని శరీరం మర్నాడు ఉదయం ప్రభుత్వ అసుపత్రి కి చేరింది. మరో 12 మంది దుండగులతో కలిసి అతను బాంబు దాడిలో చనిపోయినట్లు బార్య విభా సింగ్ కి సమాచారం పంపారు. నిజానికి DSP సింగ్ కి అతని సబ్ అర్దినేట్స్ కి మధ్య ఉన్న వైరం అతన్ని పొట్టన పెట్టుకుంది. అతని సబ్ ఆర్దినేట్స్ ఒక నకిలీ ఎన్కౌంటర్ లో చంపేశారు. “దయచేసి నన్ను కాల్చొద్దు. నాకు ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు” అనేది ఆయన చివరి మాట. సింగ్ భార్య 'విభా సింగ్' హై కోర్టుని ఆశ్రయించింది. సిబిఐ కి కేసు బదలాయించారు. తోటి ఉద్యోగులు క్రిమినల్స్ తో కలసి ఈ దారుణానికి పాల్పడినట్లు సిబిఐ చార్జ్ షీట్ ఫైల్ చేసింది. సుదీర్గమయిన కోర్టు ప్రక్రియ మొదలయింది. DSP సింగ్ హత్య జరిగినప్పటికి, అతనికి బార్య విభా సింగ్ కి కింజాల్ అనే ఆర్నెళ్ళ పాప, ఇంకా లోకం చూడని (ప్రింజాల్ సింగ్) బిడ్డ ఉన్నారు. తల్లి కి వారణాసి ట్రెజరీ లో ఓక చిన్న ఉద్యోగం ఇచ్చి ప్...

పికెటింగ్(కథ)

Image
                    “అవతార్ కార్మికుల సంఘం వర్థిల్లాలి". 'అవతార్ కార్మికులను పనిలోకి తీసుకోవాలి'. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి'.              నినాదాలతో అనంతపురం టవర్‌క్లాక్ దద్దరిల్లుతోంది. దాదాపు వందమంది కార్మికులు మానవాహారం ప్రదర్శిస్తున్నారు. అరగంటయ్యేసరికి వారికి మద్దతుగా వివిధ సంఘాలు, వాళ్ళ నాయకులు వచ్చి చేరినారు.         కార్మికుల ప్రదర్శన ప్రారంభమైంది. కలెక్టరు ఆఫీసు ముట్టడికి బయలుదేరినారు.      'కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి',  ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి'    ఇలాంటి నినాదాలజోరు పెరిగిపోతోంది.  సప్తగిరి సర్కిల్ లోకి వచ్చేసరికి కార్మికుల సంఖ్య పెరిగిపోతోంది. విలేకరులు, వివిధ ఛానల్స్ వారు ప్రదర్శనను వీడియో తీస్తున్నారు. కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు.      ప్రదర్శన మెల్లగా కలెక్టరు ఆఫీసు చేరుకుంటోంది.     జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి అవతార్ కార్మికులకు మద్దతుగా లారీల్లో వచ్చి దిగుతున్నా...

అందరూబాగుండాలి

నల్లప్ప వంకాయ సాగు చేస్తున్నాడు. కానీ పంటకు బాగా పురుగు పట్టింది. పంట ను కాపాడటానికి  రకరకాల మందులు పురుగుమందులమ్మే అంగళ్ళ నుంచి  మందులు తెచ్చి వాడుతున్నాడు. అయినా అవి తగ్గినట్టే తగ్గి మరలా వస్తున్నాయ్. ఇంత ఖర్చు చేస్తున్నా దిగుబడి రాక పోతే వచ్చే నష్టాన్ని తలుచుకుని బాగా దిగాలు పడుతున్నాడు.  మంచంలో కదల లేని పరిస్థితుల్లో ఉన్న వెంకట్రామయ్య తాత,  తన మనవడు నల్లప్ప ఆందోళనను గమనించాడు. "ఏరా అబ్బి, నీలో నువ్వే బాధ పడతాండావు?" అని అడిగాడు. ఏం లేదు తాతా "వంకాయ   పంటకు, ఎన్ని పురుగు మందులు చల్లినా  మరలా పురుగులు వస్తున్నాయి, ఏంచేయాలో తోచడం లేదు." దిగులుగా చెప్పాడు. అప్పుడు తాత "ఓరి వెర్రోడా! నువు మందు వాడగానే కొన్ని పురుగులు చనిపోతాయి. కొన్ని ప్రక్క వాడి పొలము లోనికి వెళ్తాయి.మందు పవర్ ఐపోగానే ప్రక్క వాడి పొలం లో పురుగు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి నీ పొలం లోకి వస్తాయి. కనుక నువు ఏ మందు వాడుతున్నావో  ప్రక్కోనికి కూడా చెప్పాలి.అతను కూడా వాడేటట్లు సహాయము చెయ్యాలి.అప్పుడు అందరు రైతులు వారి వారి పొలాలలో  మందు వాడినందు వల్ల   అందరూ సుభిక్షంగా ఉంటారు"అం...

చతురత

ములకనాడు (కడప జిల్లా ప్రాంతం)లో విజయనగరాన్ని ఉదారుడనే రాజు పాలిస్తున్నాడు. ఉదారుని సైన్యాధిపతి దృఢవర్మ కుమారుడు జయకేతన మంచి చురుకైన యువకుడు. చక్కదనం, భుజబలంతో పాటు బుద్ధిబలం ఉన్న వాడు.          జయకేతన్ తల్లిదండ్రులకేగాక రాజ కుటుంబీకులందరికీ తలలో నాల్కవంటివాడు. అలాంటి అబ్బాయికి రాజు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాడు. మంచి సౌందర్యం, శృంగారవతి అయిన కన్యను వెదకమని తన పురోహితునికి చెప్పినాడు. ఈ విషయం జయకేతనకు తెలిసింది.        జయకేతనకు పెళ్లంటే ఇష్టం లేదు.అందువల్ల తనకు తెలిసిన మంత్రులతో “సంసార దు:ఖానికి మూలంపెళ్లి. పెళ్ళంటే నాకు పడదు. బ్రహ్మచారిగానే ఉంటాను. అదే నాకు ఆనందం' అన్నాడు.        మంత్రులు 'జయా! పెళ్లి చేసుకుంటే భార్యతో వచ్చే సుఖం, ఆనందంఅంతాఇంతా కాదు. పిల్లలు కలిగితే వారిని ఆడించి, పాడించి మీ జీవితం ఆనందమయం చేసుకోవచ్చు. ప్రతి మనిషి కర్తవ్యం మానవ పరంపరనుముందుకు తీసుకుపోవడమే. అదే మనిషి ధర్మం 'అన్నారు.          'స్త్రీల మొహం చూడలేను. ఏదైనా వేరే ప్రాంతానికి వెళ్లిపోతాను. నన్ను విడిచి పెట్టండి'...

మొగుడు మధ్యలో వస్తే...

      చంద్రావతి నగరాన్ని పాలించే రత్నాకరుని రాజాస్థానంలో కళావంతుడనే పండితుండే వాడు. వసుమంతుడనే పెద్ద వర్తకుడు, అపరకుబేరుడు కూడా ఉండేవాడు ఆ నగరంలోనే. కళావంతుడు వసుమంతునికి మంచి మిత్రునిలాగా సలహాదారునిగా కూడా ఉండేవాడు.         ఒక రోజు రత్నాకరరాజు వసుమంతున్ని పిలిచి గొప్పగా సన్మానం చేసినాడు. ఆ సభలో అతనితో 'వసుమంతుగారూ ! మీరు సముద్రానికవతల ఉన్న ఫ్రెంచి(ఫ్రాన్స్) దేశం నుండి కొన్ని వస్తువుల్ని మన కోశాగారానికి మీ ఓడలో తీసుకురావాలి' అని కోరాడు.         వసుమంతుడు రాజుగారి సన్మానానికి ఉబ్బితబ్బిబ్బై ముందు వెనుక ఆలోచించ కుండా, 'తప్పకుండా మీ ఆజ్ఞ రాజా' అని అన్నాడు.         ఫ్రెంచ్ దేశానికి సముద్ర మార్గం లో పోయిరావాలంటే కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక్కపూటైనా తన భార్యను వదిలి ఉంటే బాధగా ఉంటుంది. పైగా ఆమె గర్భవతి, రాజుగారి విన్నపం. ఎరక్కపోయి ఇరక్క పోయానే' మనసులో అనుకుంటూ కళావంతుని సలహా అడిగినాడు.      'రాజుల్ మత్తుల్ వారి సేవలు నరకప్రాయం' అని పెద్దలు అన్నారు.రాజుల దగ్గర పనిచేయడం కత్తిమీద సాములాంటిది. వారు ఆ...