Posts

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

డాక్టర్ దేవరాజు మహారాజు ఉవాచ! "#ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా? ++++++++++++++               యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఒక బ్రేకింగ్‌ న్యూస్‌ లాగా - దేశంలోని అన్ని విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌లకు ఏడాది క్రితం ఒక సర్కులర్‌ పంపింది.  తక్షణం విద్యార్థులందరికీ ఆవుపై ఓ పరీక్ష నిర్వహించాలన్నది - అందులోని సారాంశం!  స్వదేశీ గోవుల ప్రాముఖ్యం గురించి, దాని చుట్టూ అల్లుకున్న వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణం వంటి అంశాల గురించి - అంతే కాదు, ఆధ్యాత్మిక చింతనపై కూడా ప్రశ్నలుంటాయని యూజీసీ తెలిపింది.  ఈ పరీక్షను రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ (ఆర్‌కెఎ) నిర్వహిస్తుందని, పాఠశాల, కళాశాల విద్యార్థినీ విద్యార్థులందరూ ఆ పరీక్ష రాయాలని యూజీసీ కోరింది.  పదకొండు ప్రాంతీయ భాషల్లో, ఇంగ్లీషులో జరిగే ఈ పరీక్ష 25 ఫిబ్రవరి 2021న జరుగుతుందనీ, అందరూ ఆ పరీక్షరాసే విధంగా ప్రోత్సహించాలని వైస్‌-ఛాన్సలర్‌లను యూజీసీ ఆదేశించింది.  ఇంతకూ యూజీసీ ఎందుకు అలా చేసిందీ అంటే, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ గనక, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యూజీసీ కార్యదర్శి రజనీష్‌ జైన్‌ ...

Control over NSE

చిత్రా రామకృష్ణ. నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌-NSE ఎండీ, సీఈవో. 2013లో ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ ‘విమన్‌ ఆఫ్ ది ఇయర్‌’ ఆమె. భారత్‌లో రెండో శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్త. ఇదంతా గ‌తం. ఇప్పుడామె సెబీ విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నారు. ఆమెపై నిషేధ‌మూ ఉంది. శాల‌రీలో కొంత భాగం ఆపేశారు. ట్రేడింగ్ సామ్రాజ్యాన్ని ఏలిన ఆమె.. ఇప్పుడిలా దోషిలా నిల‌బ‌డ‌టానికి కార‌ణం.. ఓ హిమాల‌య యోగి. ఆమె చెబుతున్న 'అదృశ్య' స్టోరీ.  చిత్రా కెరీర్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌గా స్టార్ట్ అయింది. 1985లో ఐడీబీఐ బ్యాంక్‌కు చెందిన ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ డివిజన్‌లో చేరారు. ఆ త‌ర్వాత కొంతకాలం సెబీలో పనిచేసి.. మ‌ళ్లీ ఐడీబీఐ బ్యాంక్‌కు తిరిగొచ్చారు. బీఎస్‌ఈలో హర్షద్‌ మెహతా కుంభకోణం తర్వాత.. పారదర్శక ట్రేడింగ్ కోసం కేంద్రం ఐదుగురితో ఎన్ఎస్ఈ ఏర్పాటు చేయ‌గా.. అందులో చిత్ర రామకృష్ణ ఒకరు. 2009లో చిత్ర.. NSEకి ఎండీగా బాధ్యతలు చేపట్టారు. 2013లో NSE సీఈఓగా ఎదిగారు.  20 ఏళ్ల‌ పాటు ఎన్‌ఎస్‌ఈకి వ‌ర్క్ చేసిన చిత్ర.. 2016 డిసెంబరులో అనూహ్యంగా ఎండీ, సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అదే స‌మ‌యంలో ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో సెబీ ఆమెపై చర్య...

మేకప్

_*కలెక్టర్ మేడమ్ మీరు మేకప్ ఎందుకు వేసుకోరు ...?*_   మలప్పురం జిల్లా కలెక్టర్ మిస్ రాణి సోయామోయి కళాశాల విద్యార్థులతో సంభాషిస్తున్నారు. ఆమె చేతి గడియారం తప్ప మరే ఇతర నగలు ధరించలేదు. చాలా మంది విద్యార్థులను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, ఆమె ఫేస్ పౌడర్ కూడా ఉపయోగించలేదు.ప్రసంగం ఆంగ్లంలో ఉంది. ఆమె ఒకట్రెండు నిముషాలు మాత్రమే మాట్లాడింది, కానీ ఆమె మాటల్లో దృఢ నిశ్చయం ఉంది. అనంతరం చిన్నారులు కలెక్టర్‌ను కొన్ని ప్రశ్నలు అడిగారు. ప్ర: మీ పేరు ఏమిటి? నా పేరు రాణి, సోయామోయి నా ఇంటి పేరు. నేను జార్ఖండ్ వాసిని. ఇంకేమైనా అడగాలా? ఒక సన్నని అమ్మాయి ప్రేక్షకుల నుండి లేచి నిలబడింది. అడగండి.. "మేడమ్, మీరు ఎందుకు మేకప్ వేసుకోరు?" కలెక్టర్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె సన్నటి నుదుటి మీద చెమట కారింది. ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైంది.  ప్రేక్షకులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తెరిచి కొంచెం నీళ్లు తాగింది.  తర్వాత విద్యార్థిని కూర్చోమని నెమ్మదిగా సైగ చేసింది. అప్పుడు ఆమె నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించింది. మీరు ఇబ్బందికరమైన ప్రశ్న అడిగారు. ఇది ఎప్పటికీ ఒక్క మాటలో స...

PRC Katha

మిత్రమా! మనం మోసపోయామా? కావచ్చు. అంతా ఆటలో భాగమే. నో రిగ్రెట్స్. శాపనార్ధాలొద్దు. ఆర్తనాదాలు అసలే వద్దు. ఏముంది వాటి వల్ల ప్రయోజనం? గతంలో లేనివి ఈ పి ఆర్ సీ సందర్భంగా ఏం సాధించాం మనం?  బహుశా ఏమీ సాధించలేకపోయాం.ఉన్నవి కూడా పోగొట్టుకున్నాం.   62పదవీ విరమణ మనం సాధించుకున్నది కాదు, అసలు మనం కోరినదీ కాదు,తమ వెసులుబాటు కోసం ప్రభుత్వం తనంత తానుగా కొసరినదే.    గత పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను, అలవెన్సులను నిలుపుకోలేకపోయాం. ‘ప్రస్తుత ఆర్ధికస్థితి’ బాగోలేదని చెబుతూ ‘శాశ్వత నష్టం’ కలిగేలా చేసిన మార్పులను అడ్డుకోలేక పోయాం.  సీ పీ ఎస్ సోదరులకు చేసిన వాగ్దానం సంగతేమిటని గట్టిగా అడగనైనా అడగలేకపోయాం. (కాకపోతే ఒకటి. “మీకు పెంచాం. కావాలంటే పే స్లిప్పులు చూసుకోండి” అని ఎవడూ అనడేమో ఇప్పుడు.) ఈ సందర్భంగా మనకెదురైన అనుభవాలు అమూల్యమైనవి.వాటినుంచి పాఠాలు నేర్చుకోవాలి. నువ్వు ప్రశ్నించడం మొదలుపెట్టగానే నీ నైతికతను చర్చల్లోకి లాగారు చూశావా? ఎక్కడో బీహార్ చత్తీస్గడ్ లలోని ఫోటోలను తీసుకొచ్చి ఇక్కడి టీచర్లపై ద్వేషం పెంచాలని చూశారు చూశావా? తమకు అనుకూలంగా వీడియోలను కత్తిరించుకుని...

బోర్ పాయింట్

కొబ్బరికాయతో బోర్ పాయింట్ చెప్పడం శాస్త్రీయమా ? * * * * * * *  * * *  మా ఫ్రెండ్ రమేష్ 200 గజాల స్థలం కొన్నాడు. "ఓస్ ఇంతేనా మా ఫ్రెండ్స్ లో కూడా అలా కొన్నవారు ఉన్నారు" అని అనుకున్నట్టున్నారు కదా ..🙄  అసలు సంగతి కొద్దాం. ఆ 200 గజాల స్థలం బోర్ వెల్ యజమాని యాదగిరిది. ఆయన ఆ స్థలంలో  కొబ్బరికాయతో, కర్ర పుల్లలతో  వివిధ వ్యక్తులతో ( వారు బోర్ పాయింట్ చెప్పడంలో నిపుణులంట ) మూడు చోట్ల పాయింట్ వేయించుకుని బోర్ లు వేశాడు. మూడు చోట్ల 600 feets వేసినా సరైన మోతాదులో నీరు రాలేదు. ఇక ఈ ప్లాట్ లో వాటర్ ఉండవని నిర్ణయించుకున్న ఆయన చాలా తక్కువ రేటుకే మా రమేష్ కి అమ్మేశాడు. ఇది తెలియని మా మిత్రుడు ఆ ప్లాట్ కొని, ఆయన ఇంటి ప్లానుకు అనుకూలంగా ఎవరితో కూడా పాయింట్ చెప్పించుకోకుండా బోర్ వేయించాడు. 150 అడుగులకే వాటర్ ఫుల్ గా వచ్చాయ్. ఇది తెలిసిన  ప్లాట్ ముందు యజమానికి కళ్ళు బైర్లు కమ్మాయ్.. ఇది కల్పిత పేర్లతో వ్రాసిన యదార్థ సంఘటన. # కొబ్బరికాయ చేతిపై పెట్టుకుని మనిషి కదులుతున్నప్పుడు ఆ కాయ లోని నీళ్లు కూడా కదిలి కాయ పడుతూ లేస్తూ ఉంటుంది. దీనితో భూగర్భజలాల కదలికలు నిర్ధారించుకోవడం మూఢ...

మట్టిపెల్లవాసన

మట్టిపెల్లవాసన | Gotelugu.com https://www.gotelugu.com/telugustories/view/10087/matti-pella-vasana#.YaT0wX9v6Bc.whatsapp | Gotelugu.com https://www.gotelugu.com/telugustories/view/10087/matti-pella-vasana#.YaT0wX9v6Bc.whatsapp
*అశోక విజయదశమి Vs దశరా* *మహిశాసురుడు ఎవరు.?* జంబూద్వీపంలోని ద్రవిడ ప్రాంతమైన మైసూర్ రాజ్యాన్ని పాలించిన మహారాజ్. ఇతను నిర్మించిన మహిశాసుర నగరాన్ని  ప్రస్తుతం మనం మైసూర్(మహిశాసుర్) గా పిలుస్తున్నాము . *అతనికి ఆపేరు ఎలావచ్చింది.?* మహి అంటే భూమి అని అర్థం.  విధేశీ తెగలైన ఆర్యులు సుర అనే ఒక పానీయాన్ని సేవించి విందు ,వినోధాలతో,యజ్ఞ యిగధులలో తెలియాడుతూ ఉండేవారు. సుర అనే మధ్యపాణాన్ని సేవించడంలో విదేశీ ఆర్యులను సురులు అనేవారు. ఈ దేశ మూలవాసులను అసురులు అనేవారు. మహిశాశుర్ అంటే భూమి పుత్రుడు ,స్థానికుడు అని అర్థం. *విజయదశమి అంటే ఏమిటి అది ఎప్పడు ప్రారంభం అయ్యింది.?* అశోకుడు కళింగ యుద్ద అనంతరం శోకంలో మునిగి పరివర్తన చెందాడు. ఇకపై శోకము లేని రాజ్యాన్ని నిర్మించాలని తన దగ్గర ఉన్న ఆయుధాలను వదిలి వాటిని  బౌద్దబిక్షువు అయిన మొగలిపుత్రతిస్స కు అప్పగించి ,ఇకపై యుద్ధం చేయనని ప్రమాణం తీసుకున్నాడు. బౌద్ధం లోని పది పరామితాలను పాటించడానికి *దశమి* రోజున సంకల్పం పొందాడు. తనలో ఉన్న చెడుపై  ,మంచి సాధించిన విజయంగా నాటి నుంచి అశోక విజయదశమిగా జరపడం ప్రారంభం అయ్యింది. చరిత్ర తెలిసిన కొనసాగింపుగా *డ...