బోర్ పాయింట్


కొబ్బరికాయతో బోర్ పాయింట్ చెప్పడం శాస్త్రీయమా ?

* * * * * * *  * * * 

మా ఫ్రెండ్ రమేష్ 200 గజాల స్థలం కొన్నాడు.

"ఓస్ ఇంతేనా మా ఫ్రెండ్స్ లో కూడా అలా కొన్నవారు ఉన్నారు" అని అనుకున్నట్టున్నారు కదా ..🙄 

అసలు సంగతి కొద్దాం.

ఆ 200 గజాల స్థలం బోర్ వెల్ యజమాని యాదగిరిది.

ఆయన ఆ స్థలంలో  కొబ్బరికాయతో, కర్ర పుల్లలతో  వివిధ వ్యక్తులతో ( వారు బోర్ పాయింట్ చెప్పడంలో నిపుణులంట ) మూడు చోట్ల పాయింట్ వేయించుకుని బోర్ లు వేశాడు.

మూడు చోట్ల 600 feets వేసినా సరైన మోతాదులో నీరు రాలేదు.

ఇక ఈ ప్లాట్ లో వాటర్ ఉండవని నిర్ణయించుకున్న ఆయన చాలా తక్కువ రేటుకే మా రమేష్ కి అమ్మేశాడు.

ఇది తెలియని మా మిత్రుడు ఆ ప్లాట్ కొని,
ఆయన ఇంటి ప్లానుకు అనుకూలంగా ఎవరితో కూడా పాయింట్ చెప్పించుకోకుండా బోర్ వేయించాడు.

150 అడుగులకే వాటర్ ఫుల్ గా వచ్చాయ్.

ఇది తెలిసిన  ప్లాట్ ముందు యజమానికి కళ్ళు బైర్లు కమ్మాయ్..

ఇది కల్పిత పేర్లతో వ్రాసిన యదార్థ సంఘటన.

# కొబ్బరికాయ చేతిపై పెట్టుకుని మనిషి కదులుతున్నప్పుడు ఆ కాయ లోని నీళ్లు కూడా కదిలి కాయ పడుతూ లేస్తూ ఉంటుంది. దీనితో భూగర్భజలాల కదలికలు నిర్ధారించుకోవడం మూఢనమ్మకం #

- తులసీరామ్. జి. JVV, హైదరాబాద్.

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE