కనిపించని శత్రువు
కనిపించని శత్రువు __ పిళ్లా కుమారస్వామి చికాగో ఎయిర్ పోర్టులో బెంగుళూరు కు వెళ్లే ఫ్లైట్ సిద్ధంగా ఉందని అనౌన్స్మెంట్ జరుగుతోంది. నరేన్ త్వర త్వరగా వెళ్లి ఫ్లైట్ ఎక్కేశాడు. సీట్లో కూర్చోగానే సీట్ బెల్ట్ వేసుకొని ఎదురుగా ఉన్న స్క్రీన్ పైన న్యూస్ కోసం బటన్ నొక్కాడు. చైనాలో కరోనా వచ్చిందని అది మెల్లగా ఇతర దేశాలకు విస్తరిస్తోందన్న సమాచారం ఉంది.భారతదేశంలో ఇంకా అది విస్తరించలేదన్న సమాచారం కూడా ఉంది. పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా కళ్ళు మూసుకున్నాడు. ఇండియాకు వచ్చామని చెప్పగానే సీట్ బెల్ట్ వదిలేసి ఫ్లైట్ దిగి బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చాడు. వచ్చే ముందర కరోనా టెస్ట్ చేశారు. కరోనా లేదని నిర్ధారించి 14 రోజుల వరకు గృహనిర్బంధంలో ఉండాలని చెప్పి ఒక సీలు వేసి బయటకు పంపించారు. ఎయిర్పోర్ట్ బయటకు రాగానే హిందూ పురం కు క్యాబ్ బుక్ చేశాడు నరేన్. కారులో ప్రయాణిస్తూ సెల్ ఫోన్ తీ...