కనిపించని శత్రువు


కనిపించని శత్రువు
               __ పిళ్లా కుమారస్వామి
                    
  
చికాగో ఎయిర్ పోర్టులో బెంగుళూరు కు వెళ్లే ఫ్లైట్ సిద్ధంగా ఉందని అనౌన్స్మెంట్ జరుగుతోంది.
      నరేన్ త్వర త్వరగా వెళ్లి ఫ్లైట్ ఎక్కేశాడు. సీట్లో కూర్చోగానే సీట్ బెల్ట్ వేసుకొని ఎదురుగా ఉన్న స్క్రీన్ పైన న్యూస్ కోసం బటన్ నొక్కాడు. చైనాలో కరోనా వచ్చిందని అది మెల్లగా ఇతర దేశాలకు విస్తరిస్తోందన్న సమాచారం ఉంది.భారతదేశంలో ఇంకా అది విస్తరించలేదన్న సమాచారం కూడా ఉంది.
      పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా  కళ్ళు మూసుకున్నాడు. ఇండియాకు వచ్చామని చెప్పగానే సీట్ బెల్ట్ వదిలేసి ఫ్లైట్ దిగి బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చాడు. వచ్చే ముందర కరోనా టెస్ట్ చేశారు. కరోనా లేదని నిర్ధారించి 14 రోజుల వరకు గృహనిర్బంధంలో ఉండాలని చెప్పి ఒక సీలు వేసి బయటకు పంపించారు.
ఎయిర్పోర్ట్ బయటకు రాగానే హిందూ పురం కు క్యాబ్   బుక్ చేశాడు నరేన్.
      కారులో ప్రయాణిస్తూ సెల్ ఫోన్ తీసుకున్నాడు అందులో చాలా మిస్డ్ కాల్ ఉన్నాయి తన చిన్ననాటి స్నేహితుడు డాక్టర్ ప్రవీణ్ నుంచి మిస్డ్ కాల్ ఉంది వెంటనే ఫోన్ చేశాడు.
         "హలో ప్రవీణ్ ,ఎలా ఉన్నావ్"
      "హాయ్ నరేష్ ఎక్కడున్నావ్ ? ఎలా ఉన్నావ్ ? నువ్వు అమెరికా లో ఉన్నావ్ కదా! అందుకే ఫోన్ చేశాను.ఇక్కడ కరోనా వ్యాధి వస్తోంది చాలామందికి.  అక్కడ అమెరికాలో ఎలా ఉందో కనుక్కొందామని ఫోన్ చేశా. ఎలా వుంది పరిస్థితి?"
        "ప్రవీణ్, ఇప్పుడే  బ్యాంగ్ ళూర్ లో ఫ్లైట్ దిగాను.ఇంటికి వస్తున్నా. రాగానే కలుస్తాను."
       "నరేన్, కరోనా చాలా తీవ్రమైన వ్యాధి . చాలా జాగ్రత్తగా ఉండాలి .మీ ఇంటికి రాగానే నీ పిల్లలను,నీ భార్య ను తాకరాదు. నువ్వు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. నీ చేతులు శుభ్రం చేసుకోవాలి. నీ బట్టలను దూరంగా ఉంచాలి. నువ్వు 14 రోజులు ఎవరినీ తాకకుండా ఉండాలి.లేకపోతే నీ భార్య పిల్లలకు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. నీకు ఉందో లేదో తెలియదు కానీ ముందు జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలి."
          "ఏం.అంత డేంజరా?ఛస్తమా? నాది ఐరన్ బాడీ.నాకేం కాదులేరా!"
        "అంత సీన్ లేదురా.నీకు తెలుసు కదా.శీను గాడు.వాడు బాడీ బిల్డర్ గదా.వానికీ వచ్చింది.చివరి దశలో ఉన్నాడు.నా మాటవిను."
       "  ఒకే.అలాగే.నువ్ మాత్రం.మాయింటికి వచ్చేయ్."
ఫోన్ కట్టేశాడు.
      డాక్టర్ ప్రవీణ్  నరేన్ ఇంటికి వెళ్లేసరికి ఎవరో ఇద్దరు నరేన్ ఇంటినుంచి బయటకు వెళ్తున్నారు. లోపలికి వెళ్ళగానే నరేన్ తో  "ఇప్పుడు బయటికి వెళ్లిన వారెవరు" అని అడిగాడు
"ఎల్ఐసి ఏజెంట్ ,బ్రాంచ్ మేనేజర్ .పాలసీ కోసం వచ్చారు .మళ్లీ నేను తొందరగా అమెరికా కి వెళ్ళిపోతానన్న ఉద్దేశంతో "
"ఓ మైగాడ్ వాళ్ళని కూడా పిలువు. చాలా విషయాలు చెప్పాలి నీతో"
"ఏంట్రా ,ఎందుకు ఆందోళన" అడిగాడు నింపాదిగా నరేన్.

      కుర్చీలో కూర్చుంటూ నవీన్ భార్య  నళినితో " సిస్టర్, కరోనా ఇప్పుడిప్పుడే ఇండియాలోకి ప్రవేసిస్తోంది.చాలా జాగ్రత్తగా ఉండాలి. చేతులు బాగా శుభ్రంగా చేసుకోవాలి. ఇతరమనిషిని  తాకరాదు. ఇదొక వైరస్.దీనికి మందు లేదు.ఇంతవరకు కనుక్కోలేదు.  ఈ వ్యాధి సోకిన వాళ్లకు నిరోధక శక్తి ఉంటే  బతుకుతారు.లేదంటే చనిపోతున్నారు. ఇప్పుడు వచ్చిన వారు కూడా వాళ్ల చేతులను సానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి."అన్నాడు ప్రవీణ్.
"ఈ జబ్బు వస్తే ఏ లక్షణాలుంటాయన్నా? ఎలా కనుక్కోవడం ?"అడిగింది నళిని ప్రవీణ్ తో
" జలుబు,పొడి దగ్గు, జ్వరం ఉంటాయి. ఈ వైరస్ అటాక్ అయిన 14 రోజుల తర్వాత ఇవన్నీ బయటపడతాయి. అందాక బయటపడవు. ఇవి తీవ్రంగా ఉంటే అప్పుడు డాక్టర్ను కలవాలి" అన్నాడు ప్రవీణ్

"ఏం కాదులేరా, అంతా నీ ఆందోళన "నరేన్ అంటుండగానే టీవీలో ప్రధానమంత్రి దేశ ప్రజలతో మాట్లాడటానికి ముందుకు వచ్చాడు.
" జనతా కర్ఫ్యూ విధిస్తున్నాం. విధిగా  ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే ఉండి ఎవరితో కలవకుండా ఉండాలి. ఇప్పటినుంచి స్వీయ నియంత్రణలో ఉండాలి దేశమంతా లాక్ డౌన్ విధిస్తున్నాం. ప్రజలంతా సహకరించాలి.డాక్టర్లకు పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలు కూడా తెలపండి"
 నరేన్ కు అప్పుడు అర్థమైంది. "ఇకనుంచి నేను ఎక్కడా బయటకి వెళ్ళను లేరా.నేనేమో అనుకున్నా"  అన్నాడు ప్రవీణ్ తో.
      "ఓకే నరేన్, విషయం అర్థం చేసుకున్నావ్, అదే చాలు. నేనెళ్లొస్తా" అంటూ సెలవు తీసుకుని బయటికి వెళ్లాడు ప్రవీణ్.
            *****___******

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE