డాక్టర్ దేవరాజు మహారాజు ఉవాచ! "#ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా? ++++++++++++++ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా - దేశంలోని అన్ని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లకు ఏడాది క్రితం ఒక సర్కులర్ పంపింది. తక్షణం విద్యార్థులందరికీ ఆవుపై ఓ పరీక్ష నిర్వహించాలన్నది - అందులోని సారాంశం! స్వదేశీ గోవుల ప్రాముఖ్యం గురించి, దాని చుట్టూ అల్లుకున్న వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణం వంటి అంశాల గురించి - అంతే కాదు, ఆధ్యాత్మిక చింతనపై కూడా ప్రశ్నలుంటాయని యూజీసీ తెలిపింది. ఈ పరీక్షను రాష్ట్రీయ కామధేను ఆయోగ్ (ఆర్కెఎ) నిర్వహిస్తుందని, పాఠశాల, కళాశాల విద్యార్థినీ విద్యార్థులందరూ ఆ పరీక్ష రాయాలని యూజీసీ కోరింది. పదకొండు ప్రాంతీయ భాషల్లో, ఇంగ్లీషులో జరిగే ఈ పరీక్ష 25 ఫిబ్రవరి 2021న జరుగుతుందనీ, అందరూ ఆ పరీక్షరాసే విధంగా ప్రోత్సహించాలని వైస్-ఛాన్సలర్లను యూజీసీ ఆదేశించింది. ఇంతకూ యూజీసీ ఎందుకు అలా చేసిందీ అంటే, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ గనక, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యూజీసీ కార్యదర్శి రజనీష్ జైన్ ...
10వ మండలం వ సూక్తం 18మంత్రాలు పుట 363: ఊర్వశీ పురూరవుల ప్రేమ సంవాదం ఈ మంత్రాల్లో ఉంది. కాళిదాసు రచించిన 'విక్రమోర్వశీయ” కావ్యానికి ఈ సంవాదం మూల వస్తువును అందించింది. ఊర్వశి అంతరిక్షవరాసిని పురూరవుడు పృధ్వీవాసి. వారి మధ్య ప్రేమ ఏర్పడింది. కలిసి సుఖించారు. సంతానం ప్రాప్తించింది పురూరవుడు ఊర్వశి వ్యామోహంలో కూరుకుపోయి, తన రాజ్య విధినీ, ధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. అతడు, తన వ్యా మోహంనుంచి బయటపడినప్పుడే, తన విధినీ, ధర్మాన్నీ, నిర్వర్తించగలడని అనుకొని ఆ మాటే చెప్పి, ఊర్వశి బిడ్డని పురూరవునికి అప్పగించి వెళ్ళిపోయింది. అతణ్ని కార్యోన్ముఖుజ్ని చేసి వ్యామోహం - ప్రేమకు గల తేడాను చెప్పి, నిజమైన ప్రేమకు నిర్వచనం చెప్పింది వివాహేతర సంబంధం వలన కలిగిన బిడ్డ బాధ్యత తండ్రిదేనన్న సంప్రదాయం ప్రాచీన కాలంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఊర్వశి తన బిడ్డను పురూరవునికి విడిచిపెట్టి వెళ్లిపోయింది. మేనక తన బిడ్డ శకుంతలను విశ్వామిత్రునకు అప్పగించి వెళ్లిపోయింది. 10వ మండలం 34వ సూక్తం - 14మంత్రాలు పుటలు:273-274 జూదము వలన కలుగు సకల కష్టాలూ - నష్టాలూ ఇందులో వివరించడం జరిగింది కథనం ఉత్తమ పురుషలో సాగింది. ఇందులోని విషయాల...
(ఈ కధ నిరాధారం కాదు! ఇంచుమించు చాలా తెలుగు కమ్యూనిస్టు కుటుంబాల్లో ఈ నాన్న ఉంటాడు. వెతుక్కోండి!) నాన్న! {కధ} -వి.విజయకుమార్ ---------------------------- “మూడు బావున్నట్టు లేదు...ఉలుకూపలుకులేదు…చాలాసేపటి నుండి పిలుస్తున్నా... విన్నట్టులేదు..ఏంటి సంగతి”? అప్పటికి గానీ అర్దం కాలేదు..కిరణ్ చాలా సేపటి నుండీ తనను పిలుస్తున్న విషయం. “సారీ అండీ… ఏదో కథ చదువుతూ....” కిరణ్ కి అర్థం అయింది. అప్పుడు...తను నిన్న వాట్సప్ లో పెట్టిన కథ చదివిందని.....తను కొంత ఎమోషనల్ గా ఉండటం చూశాడు.. అంటే తను ఆ కథకి బాగానే కనెక్ట్ అయినదన్నమాట! అది ఓ తండ్రి తన అంత్యక్రియలు స్వగ్రామంలో జరగాలని కోరుకున్న నేపధ్యంలో ఆ కొడుకు ఎలా ఫీల్ అయ్యాడో చెబుతూ రాసిన కధ... చాలా ఎక్కువ మంది కనెక్ట్ అయిన కధ అది. వాట్సాప్ లో చదవగానే సరోజకీ పంపాను. తను అంతగా మూవ్ కావడానికి కారణం లే...
Comments
Post a Comment