ఊర్వశీ పురూరవుల ప్రేమ
10వ మండలం వ సూక్తం 18మంత్రాలు పుట 363:
ఊర్వశీ పురూరవుల ప్రేమ సంవాదం ఈ మంత్రాల్లో ఉంది. కాళిదాసు రచించిన 'విక్రమోర్వశీయ” కావ్యానికి ఈ సంవాదం మూల వస్తువును అందించింది. ఊర్వశి అంతరిక్షవరాసిని
పురూరవుడు పృధ్వీవాసి. వారి మధ్య ప్రేమ ఏర్పడింది. కలిసి సుఖించారు. సంతానం ప్రాప్తించింది పురూరవుడు ఊర్వశి వ్యామోహంలో కూరుకుపోయి, తన రాజ్య విధినీ, ధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. అతడు, తన వ్యా మోహంనుంచి బయటపడినప్పుడే, తన విధినీ, ధర్మాన్నీ, నిర్వర్తించగలడని అనుకొని ఆ మాటే చెప్పి, ఊర్వశి బిడ్డని పురూరవునికి అప్పగించి వెళ్ళిపోయింది. అతణ్ని కార్యోన్ముఖుజ్ని చేసి వ్యామోహం - ప్రేమకు గల తేడాను చెప్పి, నిజమైన ప్రేమకు నిర్వచనం చెప్పింది
వివాహేతర సంబంధం వలన కలిగిన బిడ్డ బాధ్యత తండ్రిదేనన్న సంప్రదాయం ప్రాచీన కాలంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఊర్వశి తన బిడ్డను పురూరవునికి విడిచిపెట్టి వెళ్లిపోయింది. మేనక తన బిడ్డ శకుంతలను విశ్వామిత్రునకు అప్పగించి వెళ్లిపోయింది.
10వ మండలం 34వ సూక్తం - 14మంత్రాలు పుటలు:273-274
జూదము వలన కలుగు సకల కష్టాలూ - నష్టాలూ ఇందులో వివరించడం జరిగింది కథనం ఉత్తమ పురుషలో సాగింది. ఇందులోని విషయాలు ఇప్పటి సమాజానికీ వర్తిస్తాయి. ఇందులో ఆధునిక సృజనాత్మకత దర్శనమిస్తుంది. 7వ మంత్రంలో ఈ విధంగా ఉంది. “ఒక్కొక్కసారి పాచిక చేత నిలువదు. అది అంకుశంవలె గుచ్చును. బాణమువలె పొడుచును. కత్తివలె కోయును. కాల్చినట్లు తపింపచేయును. గెలిచిన వానికి పాచిక కొడుకు పుట్టినంత ఆనందం కలిగించును. మధురంగా ఉండును. మధురభాషన వలె ఉండును. కాని, ఓడినవాని ప్రాణం తీయును." ధర్మరాజు జూద వృత్తాంతం గుర్తుకు వస్తుంది
10వ మండలం.| - వ సూక్తం - 12మంత్రాలు: పుటలు:321-323
బలాసురుడు మానవుల గోవులను గుహలో బంధించాడు. గుహనుండి గోవుల శబ్దం విని, బృహస్పతి తన అగ్నితుల్యమైన అస్త్రంతో బలుని అస్త్రం తుంచివేసి, గోవులను స్వాధీనపరచుకుని మానవులకు అప్పగించాడు. ఇదీ సారాంశం. ఈ మంత్రాల్లోని అలంకార సహితమైన వర్ణనలు చూద్దాం. 1.పంటను కాపాడుటకు పక్షులను పారద్రోలుట కొరకు చేయు ధ్వనివలె - మేఘ గర్జనవలె - మేఘము పర్వతమును తాకునపుడు వచ్చు శబ్ద తరంగంవలె - బృహస్పతి ధ్వనించాడు. 2 దంపతులను కలిపినట్లు, బృహస్పతి గోవులను మానవులతో కలిపినాడు. బృహస్పతి, ఆకాశంనుంచి ఉల్క విసిరినంతగా వెలిగినాడు. ప్రాచీన మానవుని సృజనశక్తి ప్రకృతి పరిశీలన, ఏవిధంగా వికసిస్తూ వస్తోందో ఇందులో తెలుస్తుంది
Comments
Post a Comment