కృష్ణదేవరాయల కల
శ్రీ కృష్ణదేవరాయులు ఒక రోజు నిద్రలో ఒక కల కన్నారు. ఆ కలలో ఆయినకొక అందమైన భవనం కనిపించింది. ఆ భవనం ఆకాశంలో తేలుతూ, లక్ష దీపాలతో చాలా అద్భుతంగా వుంది. తలుచుకుంటే చాలు, మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయారు. మర్నాడు సభలో ఆయిన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపారు. అది విన్న వారంతా"అలాంటి భవనాన్ని ఎలా కట్టగలం? – అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యం" అంటూ ఆయనకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. రాయలు కోపంతో “అదంతా నాకు అనవసరం. మీరేంచేస్తారో నాకు తెలీదు కాని నా కల నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను లక్ష వరహాల బహుమానము ఇస్తా – లేదా మీరందరు నాకు కనిపించకండి” అని ఆఙ్ఞాపించారు. విన్నవారంతా నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయలు ఆ కలను మరువలేకపోయాడు. నెరిసిపోయిన గడ్డం, జుత్తు, మీసాలతో పాపం అతికష్టం మీద కర్రతో నడుస్తున్న వృద్ధుడు"నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి" అని రాయల సభలోకి వచ్చి ప్రార్థించాడు. “నీకేమన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను న్యాయం చ...