Posts

Showing posts from September, 2020

ఆశయం

"నేను విధవరాలినే చేసుకుంటాను' అన్నాడుశివయ్య దృఢంగా. “ఏం? ఎందుకని? అడిగాడు స్వామి. స్వామి అడిగిన ప్రశ్నకు శివ కొంచెంసేపు మౌనం వహించాడు. స్వామే మళ్ళీ “ఎందుకు విధవరాలిని చేసుకోవాలనుకుంటున్నావు?” అని అడిగినాడు. 'ఒకరి జీవితంలో నైనా వెలుగు నింపాలని నాఆశయం' అని జవాబిచ్చాడు శివయ్య, 'నీ దృష్టిలో ఎవరైనా వున్నారా?” అడిగాడు స్వామి. అవునన్నట్లు తలూపినాడు శివయ్య. 'ఎవరామె, ఏ పేరు?" “అక్షరాస్యతా ఉద్యమంలో కళాకారిణిగా పనిచేసింది. పల్లెపల్లెలో చదువు అవసరాన్ని చెపుతూ ప్రచారం చేసే కళాబృందాలు ప్రభుత్వ సారధ్యంలో ఉండేవి. జనవిజ్ఞాననివేదిక కళాకారుల్ని సమకూర్చేది. కళాకారుల్లో ఒకామె చురుకుగా కలివిడిగా ఉండేది. ఆమె పేరు ఇంద్రాణి"చెప్పినాడు శివయ్య. శివయ్య, స్వామి ఇద్దరూ మంచి మిత్రులు. స్వామి ఇరవై ఏళ్ళనుంచి యంగ్ ఇండియా అనే   సంస్థలో చాలా పదవులను నిర్వహిస్తూ వస్తున్నాడు. శివయ్య విద్యార్థి దశనుంచి నేరుగా ఆ సంస్థ లోకి ప్రవేశించి రెండేళ్ళయింది. శివయ్య స్వామి తో సన్నిహితంగా వుంటాడు. శివయ్య పట్ల స్వామికి ప్రత్యేక అభిమానం ఉంది. అందుకే స్వామి శివయ్యకు “శివా నువు మంచి అమ్మాయిని చూసుకుని పెళ్...

గుంటూరు దయ్యం

                              అప్పటికింకా నావయస్సు పదేళ్ళు దాటలేదు. మేమప్పుడు కడపజిల్లా రాజంపేటలో ఉండేవాళ్ళం. అందరికంటే చిన్న వాన్ని కావడం వల్ల, తల్లిలేని వాణ్నవడం వల్ల అందరూ నన్ను అల్లారు ముద్దుగా చూసుకొనే వారు. మా వదినె మరీనూ. ఓ రోజు ఉన్నట్టుండి భోజనం చేస్తూ ఉండగా గట్టిగా అరుస్తూ మా వదినె గభాల్న లేచి మంచం మీదకి వెళ్లి పడుకొనింది.     గుంటూరు యాసలో “ఏమండీ! ఇలాగానే భోజనం పెట్టేది? " అంటూ మాట్లాడటం ప్రారంభించింది. కొంత సేపు ఎవరికీ అర్థం కాలేదు. పదినిమిషాల తరువాతమామూలు మనిషైంది.        అప్పుడు ఇంట్లో అందరూ మావదినెకు దయ్యం పట్టిందని తీర్మానించారు. మా అన్న మాత్రం ఊర్లో లేడు. ఆయన రాగానే వదినెకు దయ్యం పట్టిన విషయం చెప్పారు. ఆయన ఒక్కమాటలో 'దయ్యం లేదు గియ్యం లేదు' అంటూ కొట్టిపారేశాడు. మానాన్న మాత్రం దయ్యం పట్టిందనే నమ్మాడు. రెండు రోజుల తరువాత ఒక మంత్రగాణ్ని పిలుచుకు వచ్చాడు. మంత్రగాడు ఇంట్లో నడి మధ్యలో ఒక ముగ్గువేశాడు. ముగ్గు ముంగిట మావదినెను కూర్చోబెట్టి మంత్రాలు చదవనా రంభించాడు. ...