Posts

Showing posts from August, 2021
చిరిగిన పంచి చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి తన 15-16 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్‌కు వచ్చాడు. ఇద్దరూ కుర్చీలపై కూర్చోవడం చూసి, ఒక వెయిటర్ రెండు గ్లాసుల  చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు - మీ కోసం ఏమి తీసుకురావాలి? ఆ వ్యక్తి ఇలా అన్నాడు- " జిల్లాలో పదవ తరగతిలో మొదటి స్థానంలో వస్తే, నగరంలోని అతిపెద్ద హోటల్‌లో  #దోశ తినిపిస్తాను, అని  మా అమ్మాయికి వాగ్దానం చేశాను." మా అమ్మాయి వాగ్దానాన్ని నెరవేర్చింది. దయచేసి తన కోసం ఒక దోశ తీసుకురండి. "వెయిటర్ అడిగాడు-" మీ కోసం ఏమి తీసుకురావాలి? "అతను అన్నాడు-" నా దగ్గర ఒక దోశకు సరిపడే డబ్బే ఉంది. నాకు వొద్దు ..."మొత్తం విషయం విన్న తర్వాత వెయిటర్ యజమాని వద్దకు వెళ్లి మొత్తం కథ చెప్పాడు- "నేను వీళ్ళ ఇద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలి అని అనుకుంటున్నాను . ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసివేయవచ్చు." అప్పుడు యజమాని అన్నాడు- "ఈ రోజు మనం హోటల్ తరపున తను ఫస్ట్ వచ్చినందుకు వాళ్లకి పార్టీ ఇద్దాం అన్నాడు ...  ఇది విని వెయిటర్ చాలా ఆనందపడ్డా...