Control over NSE
చిత్రా రామకృష్ణ. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్-NSE ఎండీ, సీఈవో. 2013లో ఫోర్బ్స్ మ్యాగజీన్ ‘విమన్ ఆఫ్ ది ఇయర్’ ఆమె. భారత్‌లో రెండో శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్త. ఇదంతా గతం. ఇప్పుడామె సెబీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఆమెపై నిషేధమూ ఉంది. శాలరీలో కొంత భాగం ఆపేశారు. ట్రేడింగ్ సామ్రాజ్యాన్ని ఏలిన ఆమె.. ఇప్పుడిలా దోషిలా నిలబడటానికి కారణం.. ఓ హిమాలయ యోగి. ఆమె చెబుతున్న 'అదృశ్య' స్టోరీ.
చిత్రా కెరీర్ ఛార్టెర్డ్ అకౌంటెంట్‌గా స్టార్ట్ అయింది. 1985లో ఐడీబీఐ బ్యాంక్‌కు చెందిన ప్రాజెక్ట్ ఫైనాన్స్ డివిజన్‌లో చేరారు. ఆ తర్వాత కొంతకాలం సెబీలో పనిచేసి.. మళ్లీ ఐడీబీఐ బ్యాంక్‌కు తిరిగొచ్చారు. బీఎస్‌ఈలో హర్షద్ మెహతా కుంభకోణం తర్వాత.. పారదర్శక ట్రేడింగ్ కోసం కేంద్రం ఐదుగురితో ఎన్ఎస్ఈ ఏర్పాటు చేయగా.. అందులో చిత్ర రామకృష్ణ ఒకరు. 2009లో చిత్ర.. NSEకి ఎండీగా బాధ్యతలు చేపట్టారు. 2013లో NSE సీఈఓగా ఎదిగారు.
20 ఏళ్ల పాటు ఎన్‌ఎస్‌ఈకి వర్క్ చేసిన చిత్ర.. 2016 డిసెంబరులో అనూహ్యంగా ఎండీ, సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో సెబీ ఆమెపై చర్యలు చేపట్టింది. ఇక, చిత్ర రామకృష్ణ హయాంలో NSE చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా ఆనంద్ సుబ్రమణియన్‌ను నియమించడం.. కొంతకాలానికే ఆయన్ను గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎండీ సలహాదారుగా మార్చడం అనుమానాస్పదంగా మారింది. ఇక, సెబీ దర్యాప్తులో మరిన్ని సంచనల విషయాలు వెలుగుచూశాయి. చిత్ర గత 20 ఏళ్లుగా ఓ ‘అదృశ్య’ యోగి ప్రభావానికి లోనైనట్టు తెలిసింది. హిమాలయాల్లో ఉండే ఆ యోగితో ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన కీలక విషయాలను పంచుకుని ఆయన నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నట్టు గుర్తించారు.
ఆ యోగి చెప్పారనే.. ఆనంద్ సుబ్రమణియన్‌ను ఎన్ఎస్ఈలో పదవి కట్టబెట్టారు. అంతకుముందు ఆనంద్ జీతం 15లక్షలు ఉండగా.. ఎన్‌ఎస్‌ఈలో ఏకంగా 1.38 కోట్ల ప్యాకేజీ ఇచ్చారు. ఆ తర్వాత ఇన్ ఇయర్‌కే అతడి శాలరీ 20శాతం పెంచేశారు. వారానికి 3 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్‌గా వెసులుబాటు కూడా కల్పించారు. ఇదంతా ఆ హిమాలయ యోగి చెప్పినందుకే.. చిత్ర రామకృష్ణ.. ఆనంద్ సుబ్రమణియన్‌కు అలాంటి బంపర్ ఆఫర్స్ ఇచ్చారని సెబీ దర్యాప్తులో తేలింది.
ఇంతకీ ఆ హిమాలయ యోగ ఎవరు? ఆయనతో చిత్రకు ఎలాంటి సంబంధం ఉందనేది మరింత ఆసక్తికరం. ఆ యోగి ఓ నిరాకారుడని, సిద్ధ పురుషుడు, శిరోణ్మని అని చిత్ర చెబుతున్నారు. తన వృత్తి, వ్యక్తిగత విషయాల్లో ఆయన నుంచి ఏళ్లుగా సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఆ యోగికి భౌతిక రూపం అంటూ ఏదీ లేదని, ఆయన ఎలా కావాలంటే అలా మారుతారని.. ఆయన హిమాలయ పర్వతాల్లో ఉంటారని.. చిత్ర సెబీ విచారణలో తెలిపారు.
అయితే, సెబీ దర్యాప్తులో ఆ అదృశ్య యోగి.. మనిషేనని తేలింది. ఆ యోగికి, చిత్రకు, ఆనంద్ సుబ్రమణియన్‌కు ఎలాంటి లింక్ ఉందని ఆరా తీస్తోంది. ఇక, ఆ యోగితో చిత్ర ఈ-మెయిల్ సంభాషణలు కూడా జరిపారని సెబీ దర్యాప్తులో తేలింది. వారిద్దరి మధ్య నడిచిన మెయిల్స్‌లో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈఓ, ఎండీ చిత్రా రామకృష్ణకు ఆధ్యాత్మిక గురువుగా వ్యవహరించిన ఆ యోగి.. ఆమె శిరోజాలపై ఆసక్తి చూపారు. జడను వేర్వేరు రకాలుగా వేస్తే ఇంకా బాగుంటావనీ ఆమెకు సూచించారు. ఆమెకు కొన్ని పాటలు షేర్ చేశారు. ఇద్దరూ కలిసి సీషెల్స్‌కు వెళ్లారనీ తెలుస్తోంది.
2015 ఫిబ్రవరి 18న చిత్రారామకృష్ణకు ఆ వ్యక్తి పంపిన ఇ-మెయిల్‌లో 'ఇవాళ నీవు చాలా బాగున్నావు. నీ శిరోజాలుగా వివిధ రకాలుగా అలంకరించుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు మరింత చూడముచ్చటగా ఉంటావు. ఉచిత సలహానే అయినా, దీన్ని నువ్వు స్వీకరిస్తావని తెలుసు' అని ఉంది. అంతకు ముందు రోజు ఇమెయిల్‌లో 'నీ బ్యాగులు సిద్ధం చేసుకో. వచ్చే నెల సీషెల్స్‌కు వెళ్లడానికి ప్రణాళికలు వేస్తున్నా. నీకు వీలుంటే నాతో రావొచ్చు. మనం వెళ్లేదారిలో హాంకాంగ్ లేదా సింగపూర్‌లో ఆగొచ్చు. నీకేదైనా సహాయం కావాలంటే చెప్పు. నీకు ఈత తెలిస్తే సముద్ర స్నానం చేయొచ్చు'.. అంటూ ఆ మెయిల్‌లో రాసుంది.
2015 సెప్టెంబరు 16 నాటి ఇ-మెయిల్‌లో ఇలా ఉంది.. 'నేను పంపిన మకర కుండల పాట విన్నావా? వాటిని కచ్చితంగా వినాలి. నీ మది నుంచి నీ మోముపైకి వచ్చే చిరునవ్వును చూస్తున్నపుడు నాకు ఆనందంగా ఉంటుంది. నిన్న సమయాన్ని పంచుకోవడం సంతోషంగా ఉంది. నీకోసం నువ్వు చేసే ఈ చిన్నచిన్న విషయాలు నిన్ను శక్తిమంతంగా, తక్కువ వయస్సు అనిపించేలా చేస్తుంది' అని రొమాంటిక్ యాంగిల్‌లో ఉంది ఆ మెయిల్ సారాంశం. ఇలా చిత్ర రామకృష్ణ ఈ-మెయిల్స్ పరిశీలించిన సెబీ దర్యాప్తు బృందం.. ఆమె చెబుతున్నట్టు అతను అదృశ్య యోగినో.. హిమాలయ యోగినో కాకపోవచ్చని.. ఓ అదృశ్య వ్యక్తి అయి ఉంటారని అంటోంది. ఇక, ఆ వ్యక్తికి ఆనంద్ సుబ్రమణియన్‌కు ఎలాంటి సంబంధం ఉంది? ఆయనే ఈయనా? చిత్ర ఆ వ్యక్తి బుట్టలో పడిందా? చిత్రనే ఇలా అదృశ్య డ్రామా ప్లే చేస్తోందా? అనే కోణంలోనూ సెబీ విచారిస్తోంది.
P. Chidambaram’s Regulatory Capture and Control over NSE – The flow of events
Year
Events
1998
Karti Chidambaram actively started trading in the stock market
2004
P Chidambaram (PC) became the Finance Minister
Act of Regulatory Capture by P Chidambaram
2005
M Damodaran became the SEBI Chairman
M Damodaran didn’t agree over P. Notes as proposed by P. Chidambaram and therefore the relations turned sour.
2005
PC made K.P. Krishnan (KPK) as Jt. Secretary in Capital Markets Division – Department of Economic Affairs (DEA), Ministry of Finance (MoF)
2008
M Damodaran was removed as SEBI Chairman, driven by KPK on behalf of PC
Since then Damodaran is silent as he has been settled by Chidambaram
2008
CB Bhave was made SEBI Chairman by KPK on behalf of PC. The appointment itself is questionable as Bhave was appointed SEBI Chairman despite not having applied for the post nor was he amongst the shortlisted candidates by the Search panel. Infact the SEBI was investigating NSDL IPO Scam which happened when CB Bhave was MD&CEO of NSDL
2008
P Chidambaram began to place his loyal people at key positions to have complete regulatory capture with KM Abraham and MS Sahoo (who was earlier in Finance Ministry) as Members in SEBI and S Ramann as OSD in SEBI under Bhave. CKG Nair was given post of Director in Capital Markets Division – DEA, MoF under KPK
Kohinoor City, a commercial-cum-residential project in Kurla, was built by Kohinoor Planet Constructions, owned by Unmesh Joshi, son of Shiv Sena leader and former Maharashtra CM Manohar Joshi. ManoharJoshi was Godfather of CB Bhave.
Unmesh Joshi was given favour of Rs 140 crs from NSE for CB Bhave.
2008
Nifty the benchmark index of NSE was launched on SGX, Singapore in violation of FERA & FEMA of relevant time.
Karti Chidabaram took huge positions on SGX to start manipulating the Nifty and make illegal gains in USD so that money can be parked abroad.
2009
KM Abraham and MS Sahoo given a flats in Kohinoor City
All core employes of NSE were given flat in Kohinoor City as captured by Journalist Sucheta Dalal
The gratitude was in return of loyalty towards KP Krishnan and P. Chidambaram
2009
NSE illegally started co-location facility in name of Direct Market Access (DMA) without SEBI’s permission
2011
Ajay Shah and Susan Thomas started providing Algo in derivatives
Ajay Shah and Susan Thomas were given unauthorized access to data of NSE by its management under Ravi Narain & Chitra Ramkrishna
Omnesys Technologies a software company started providing algotrading services. Omnesys Technologies and its subsidiary ChanakyaTradevistas & Infotech Financials Pvt. Ltd. was owned by SunitaThomas who happens to be sister of Susan Thomas, wife of Ajay Shah.
Omnesys Technologies also manages NSE data center.
Chitra Ramkrishna was on the board of Omnesys. None questioned the conflict. Entire system was gamed.
Ajay Shah is so close to NSE that he is been paid royalty of 10% on the pretext of designing the Nifty
Centre for Monitoring Indian Economy (CMIE) which is a firm owned by Ajay Shah is funded by the Government. Atleast now, this should be stopped.
2012
Chitra had an illicit relationship with P Chidambaram and KPK. Chitrabecame favorite of P Chidambaram
2013
P Chidambaram one one phone call made Ravi Narain to resign as MD&CEO and Chitra took over as MD&CEO of NSE.
The first day of Chitra as MD&CEO, was also the 1st Day of AnandSubramanian in NSE
When Pranab Mukherjee became the Finance Minister, P Chidambaram bugged his office to keep updated on key decision made by him in MoF
TKA Nair is privy to the entire story and how the issue was settled out by Sonia Gandhi and Manmohan Singh
KPK and Bhave in the process of complete regulatory capture removed competition for NSE, by killing 20 regional stock exchanges, BSE and MCX-SX (now named as MSEI). Competition Commission Order against NSE has captured the full modus operandi of killing the competition.
2015
A whistleblower complained to SEBI on NSE Co-location scam, which is a fraud of over Rs 10 lakh Crores. The money has gone out of the country and PC is the ultimate beneficiary
2016
Chitra was made to resign from NSE. Ashok Chawla was the NSE Chairman who accepted the resignation of Chitra. Ashok Chawla is the same person whom CBI has prosecuted in 2019 in the Aircel-Maxis case, along with P Chidambaram showing their close link
2016
When Chitra was made to resign (when the emails of Chitra with Unknown Yogi unearthed), NSE Board under Ashok Chawla as Chairman and Ravi Narain as Vice Chairman, destroyed the laptops of Chita and Anand Subramanian as E-waste to destroy the evidence.
2019 onwards
Ajay Tyagi Chairman SEBI is a junior and fast friend of KPK. The SEBI is therefore issuing weak orders against NSE to protect NSE
P CHIDAMBARAM MADE K P KRISHNAN AS CENTER POINT FOR CO-ORDINATION THEREBY ACHIEVING A COMPLETE CAPTURE OVER SEBI AND CONTROL OVER NSE
Comments
Post a Comment