*అశోక విజయదశమి Vs దశరా*
*మహిశాసురుడు ఎవరు.?*
జంబూద్వీపంలోని ద్రవిడ ప్రాంతమైన మైసూర్ రాజ్యాన్ని పాలించిన మహారాజ్. ఇతను నిర్మించిన మహిశాసుర నగరాన్ని ప్రస్తుతం మనం మైసూర్(మహిశాసుర్) గా పిలుస్తున్నాము .
*అతనికి ఆపేరు ఎలావచ్చింది.?*
మహి అంటే భూమి అని అర్థం. విధేశీ తెగలైన ఆర్యులు సుర అనే ఒక పానీయాన్ని సేవించి విందు ,వినోధాలతో,యజ్ఞ యిగధులలో తెలియాడుతూ ఉండేవారు. సుర అనే మధ్యపాణాన్ని సేవించడంలో విదేశీ ఆర్యులను సురులు అనేవారు. ఈ దేశ మూలవాసులను అసురులు అనేవారు.
మహిశాశుర్ అంటే భూమి పుత్రుడు ,స్థానికుడు అని అర్థం.
*విజయదశమి అంటే ఏమిటి అది ఎప్పడు ప్రారంభం అయ్యింది.?*
అశోకుడు కళింగ యుద్ద అనంతరం శోకంలో మునిగి పరివర్తన చెందాడు. ఇకపై శోకము లేని రాజ్యాన్ని నిర్మించాలని తన దగ్గర ఉన్న ఆయుధాలను వదిలి వాటిని బౌద్దబిక్షువు అయిన మొగలిపుత్రతిస్స కు అప్పగించి ,ఇకపై యుద్ధం చేయనని ప్రమాణం తీసుకున్నాడు. బౌద్ధం లోని పది పరామితాలను పాటించడానికి *దశమి* రోజున సంకల్పం పొందాడు. తనలో ఉన్న చెడుపై ,మంచి సాధించిన విజయంగా నాటి నుంచి అశోక విజయదశమిగా జరపడం ప్రారంభం అయ్యింది.
చరిత్ర తెలిసిన కొనసాగింపుగా *డాక్టర్ అంబేద్కర్* 1956 అక్టోబరు 14 న ఆశోక విజయదశమి రోజు బౌద్ధం స్వీకరించి పది పరామితాలను పాటిస్తానని ప్రమాణం చేశారు
*బతుకమ్మ కు విజయదశమి సంబంధం ఏంటి?.*
కళింగ యుద్దంలో ఇరుపక్షాల వైపు ఎంతో ప్రాణనష్టం జరిగింది. ప్రజల రోదనలు మిన్నంటాయి. ఆ యుద్దంలో అమరులైన యుద్ద వీరులను స్మరిస్తూ వీరగథలను ఆలపిస్తూ పువ్వులతో నివాళి అర్పించేవారు.
ఆ వీరగథలే బతుకమ్మ పాటలైనాయి. నివాళిగా అర్పించే పువ్వులే నేడు బతుకమ్మలైనాయి, అశోకుని మానసిక పరివర్తనా ధినమే విజయదశమి.
*దశరా ఎలామొలైంది?*
మాతృస్వామ్య వ్యవస్థలో స్త్రీ పై ఆయుధం ఎత్తడం మహా పాపం. ఆడవారితో యుద్దం చేయని ద్రవిడ రాజైన మహిశాసురుని దగ్గరకు ఆర్యులు స్త్రీ యుద్దానికి పంపారు. స్త్రీలను గౌరవించే రాజు ఆయుధాలను వదిలివేశాడు. నిరాయుధుడైనా మహిశాసురుని ఆర్య స్త్రీ తో చంపించారు. *ఇది చరిత్ర*
ఈ అశోక విజయదశమి చరిత్ర ను కనుమరుగు చేసే పనిలో బాగంగా ఆశోకుని పాలన జరిగిన 500సంవత్సరాల తర్వాత గుప్తులకాలంలో క్రీస్తు శకం 3వ శతాబ్దంలో *అష్టాదశ పురాణాలు* రాయబడ్డాయి అందులో *ఎప్పడో జరిగిన చరిత్ర ను వక్రీకరణలతో పురాణంగా* మలిచారు.
రక్షకుడైన మహిశాసురున్ని రాక్షసునిగా మార్చారు. చంపిన ఆర్య స్త్రీ ని చాముండేశ్వరీగా ,దుర్గా గా ,కాళికా చిత్రికరించారు.
ఆయుదాలు వదిలిన ఆశోకుని ఆలోచనకు వ్యతిరేకంగా ఆయుధపూజ ప్రారంబించారు.
బుద్దుని దశపరామితాలకు బదులుగా వాటిని సంహరించడానికి *దశరా(దశ్+ హర)* ను పండుగగా ప్రచారం చేశారు.
నివాళి అర్పించడానికి వాడే పూల బతుకమ్మను కాస్త గౌరీగా మార్చారు.
అశోకవిజయదశమి పండుగ స్థానంలో పేరు మార్చి కథలల్లి దశరా పండుగ గా మార్చారు.
*మహిశాశురుడు రాక్షసుడా?*
కానే కాదు . అతని రూపం ద్రవిడుల ప్రతిరూపం. ప్రజలను కన్న బిడ్డలవలే పాలించిన యోధుడు.
ఆయన ఎడమ చేతిలోని పాము , అతను నాగజాతి అనడానికి సాంకేతం.
ఇద్దరు మహా వీరులు ఒకే ముహూర్తంలో చంపబడ్డారంటే నమ్మాలా...?
ఎప్పుడు ఎవరు చస్తారో తెలీని భీకర యుధ్ధంలో రామున్ని చావుఅంచులకు తీసుకెళ్ళిన యోధున్ని ముహూర్తం పెట్టి చంపారంటే నమ్మాలా...
అసలు మగదేవుళ్ళే దరిదాపుల్లోకి రావడానికి భయపడే మా (మహీశ్వరుడు)మహిషాసూరుడు
స్త్రీ చేతిలో అదే ముహూర్తానికి చనిపోయాడంటే నమ్మాలా...
ఈ రోజు గెలిచింది చెడు పై మంచి కాదు.
మంచి రూపంలో ఉన్న చెడు గెలిచిన రోజు.
నేరుగా గెలవలేనీ ఇంద్రాది దేవతల కుటిల పన్నాగాలు స్త్రీ రూపం ధరించి మరీ గెలిచిన రోజిది...
చరిత్రకు దైవత్వాన్ని ఆపాదించి మూఢనమ్మకాల్లో మరియు శ్రమలో ఒక వర్గం ప్రజల్ని ఉంచి,మరో వర్గం అష్టైశ్వర్యాలను సుఖభోగాలను అనుభవించే ఆర్య సమాజం గెలిచిన రోజిది.
వ్యవసాయ ఆధారంగా ఐశ్వర్యంతో తులతూగే ద్రవిడభూమిని నమ్ముకున్న కష్టజీవులపై ఇరానీ సోమరిపోతులు గెలిచిన రోజిది.
ఈ రోజు చనిపోయింది రావణుడో మహిషాసురుడో కాదు మానవత్వ సమాజ విశాల ధృక్పధ సమతా భావాల ద్రవిడ సమాజం చంపబడ్డ రోజిది...
సోదరి కోసం దైవసమానున్నైనా ఎదిరించే సోదరులు చనిపోయిన రోజిది.
పర స్త్రీలను పవిత్రంగా చూసుకునే సమాజం లోంచి స్త్రీలను అనుమానించి అగ్నిపరీక్షలు పెట్టి పర స్త్రీ ముక్కు చెవులూ కోసి స్త్రీలపై దాడులు చేసే సమాజం గెలిచిన రోజుది.
అన్నెం పున్నెం తెలీని స్వశక్తితో ఎదిగే కులాలను బ్రాహ్మణుల కోసం చంపేసే సమాజం పురుడుపోసుకున్నరోజిది.
సొంత అన్న రహస్యాలను శత్రువులకు చేరవేసి సొంత రాజ్యాన్ని నాశనం చేసి అదే రాజ్యాన్ని పాలించే జాతి ద్రోహ చెంచా విభీషణులు పుట్టుకొచ్చిన రోజిది...
ధర్మం పేరుతో కులం
మతం పేరుతో అమానుషం ద్రవిడనేలలోకి అడుగుపెట్టడానికి కారణమైన రోజిది...
VINAY KIRAN
Comments
Post a Comment