అందరూబాగుండాలి






నల్లప్ప వంకాయ సాగు చేస్తున్నాడు. కానీ పంటకు బాగా పురుగు పట్టింది. పంట ను కాపాడటానికి  రకరకాల మందులు పురుగుమందులమ్మే అంగళ్ళ నుంచి  మందులు తెచ్చి వాడుతున్నాడు. అయినా అవి తగ్గినట్టే తగ్గి మరలా వస్తున్నాయ్.
ఇంత ఖర్చు చేస్తున్నా దిగుబడి రాక పోతే వచ్చే నష్టాన్ని తలుచుకుని బాగా దిగాలు పడుతున్నాడు.

 మంచంలో కదల లేని పరిస్థితుల్లో ఉన్న వెంకట్రామయ్య తాత, 
తన మనవడు నల్లప్ప ఆందోళనను గమనించాడు.

"ఏరా అబ్బి, నీలో నువ్వే బాధ పడతాండావు?" అని అడిగాడు.

ఏం లేదు తాతా "వంకాయ 
 పంటకు, ఎన్ని పురుగు మందులు చల్లినా 
మరలా పురుగులు వస్తున్నాయి, ఏంచేయాలో తోచడం లేదు."
దిగులుగా చెప్పాడు.

అప్పుడు తాత "ఓరి వెర్రోడా!
నువు మందు వాడగానే కొన్ని పురుగులు చనిపోతాయి.
కొన్ని ప్రక్క వాడి పొలము లోనికి వెళ్తాయి.మందు పవర్ ఐపోగానే ప్రక్క వాడి పొలం లో పురుగు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి నీ పొలం లోకి వస్తాయి. కనుక నువు ఏ మందు వాడుతున్నావో  ప్రక్కోనికి కూడా చెప్పాలి.అతను కూడా వాడేటట్లు సహాయము చెయ్యాలి.అప్పుడు అందరు రైతులు వారి వారి పొలాలలో  మందు వాడినందు వల్ల  
అందరూ సుభిక్షంగా ఉంటారు"అంటూ ఆగాడు.

అంతే కాదురా,

మనం మాత్రమే బాగుండాలి,
ప్రక్కోడి గురించి మనం పట్టించు కోవాల్సిన పని లేదు
అంటే ప్రకృతి సూత్రము ఒప్పుకోదురా. అందుకే మనం ఒకరికి ఒకరు  సహాయము చేసుకొంటూ వుండాలి". అన్నాడు.
"సరే తాత, నువు చెప్పినట్లు
చేసి చూస్తా",అంటూ ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా ముందుకు కదిలాడు నల్లప్ప.
         టీవీలో ఓ కార్యక్రమంలో
"అందరూబాగుండాలి.అందులోమనముండాలి"అంటున్నారెవరో.

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE