జ్వరం




     
         

      “పాపకు జ్వరమొస్తావుంది-నువ్వు ఈ రోజు తొందరగా ఇంటికొచ్చేయ్, డాక్టరుకు చూపించాలి'      రజని ఫోన్ చేసింది భర్త రత్నంకు.
          రత్నం స్కూలులో వున్నాడు. ఇంటినుంచి అరవై కిలోమీటరు దూరంలో వుండే పాలసముద్రం
స్కూలులో పనిచేస్తున్నాడు.
       'సరే' అన్నాడు.
సాయంత్రం రాగానే పాప నుదుటిపై చేయి పెట్టి చూశాడు వళ్ళు కాలిపోతోంది. 'ఎలా
తట్టు కుందో!' పైకి అనేశాడు.
'అందుకే మధ్యాహ్నంమంతా తడిబట్ట చుట్టాను పొట్టచుట్టూ' అంది రజని. అప్పుడే బట్ట ఆరిపోయి వుంది.
      వెంటనే ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు డాక్టరు దగ్గరికి, పాప వయస్సు ఆరేళ్ళు.
పాపను గట్టిగా పట్టుకుని భర్తవెనకాల జాగ్రత్తగా చూర్చుంది.
      “జ్వరం ఎంతుంది డాక్టర్?" అడిగాడు రత్నం.
     '102°', జ్వరమాని రీడింగ్ చూస్తూ అన్నాడు డాక్టరు. 'ఇంజెక్షన్ వేసేదా?'
          “వద్దు సార్ ! ఫిట్స్ వస్తాయేమోనని భయం సార్."
       "హైటెంపరేచర్ ఉన్నప్పుడు, ఇంజక్షన్ వేస్తే ఫిట్సు వచ్చే అవకాశాలున్నట్లు ఒక బుక్కులో
చదివినట్లు గుర్తు సార్."
“ఓ అలాగా! అలా జరిగే అవకాశముంది. ఒక్కోసారి. టాబ్లట్సు, సిరప్ రాయించాను, తగ్గిపోతుందిలే!"
“మామూలు జ్వరమేనా సార్?"
“మామూలు జ్వరమే. వైరల్ ఫీవర్ కాదులే."
డాక్టరుకు ఫీజు చెల్లించి ఆవరణలో డాక్టరు తరపున ఉండే మందుల షాపులో ప్రిస్కిప్షన్ ఇచ్చి మందులు తీసుకొన్నాడు.
       రజని ఆయన్ను అనుసరిస్తూవుంది. పాప ఆసుపత్రిని గమనిస్తోంది.
     'అమ్మా! రేపటికి తగ్గిపోతుందా?' పాప అడిగింది అమ్మను,
   “తగ్గిపోతుందిలే! నువ్వు మాత్రలు వేసుకుంటే, "
      'నాకెందుకొచ్చింది జ్వరం?"
నువ్వు బయట నీళ్ళు తాగొద్దంటే వినవుకదా? మన ఇంట్లోటివే తాగాలి, తెలిసిందా?
       “ఊ, తాగుతా" బుద్దిగా చెప్పింది.
       “ఐస్ క్రీం తినొచ్చా?"
“జ్వరం తగ్గాక తినొచ్చు. ఇప్పుడు తినరాదు."
అమ్మని ఇలా ఏదో ఒకటి అడుగుతూనే వుంది. ఇంటికి పోయే వరకు.
'ఏం అట్లా మాట్లాడుతోంది పాప' అడిగినాడు రత్నం.
     'జ్వరమొస్తే అంతే. జ్వరం వస్తే చిన్న పిల్లోల్లు ఏదో ఒకటి వాగుతూనే వుంటారు' రజని అంది.
      మాత్ర వేసుకోగానే జ్వరం తగ్గిపోయింది. రాత్రి పదవగానే మళ్ళీ జ్వరం వచ్చింది.
       భార్యను పక్కకి రమ్మన్నాడు రత్నం. పాపకు జ్వరం వస్తోంది, నేను రాను అంటూ పాప వద్దనే
పడుకుంది. తడిబట్ట పాప వళ్ళంతా చుట్టింది.
రత్నం నిద్రలోకి జారుకున్నాడు. రజని మేల్కోనే వుంది. గంట గంటకు తడిబట్ట చుట్టుతూనే వుంది.
 మధ్యలో వదరుతూనే వుంది పాప. 'రేపు' బడికి పోతా అని అడిగింది. సరేలే పోదువులే, జ్వరం తగ్గుతానే పోదువులేరా' జోకొడుతూ అంది రజని.
తెల్లవారు ఝామున ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు.
       మెలుకువ వచ్చేసరికి చూస్తే ఏడైంది.
“చిట్టీ! నువ్వబయటి నీళ్ళు తాగొద్దురా! మీ అమ్మ ఇచ్చి పంపే నీళ్ళు తాగు. నీకు జబ్బులేరావు" అన్నాడు తండ్రి గోముగా పాపను దగ్గరకు తీసుకుంటూ.
       “సరేనాన్నా!' అంది.
మళ్ళీ జ్వరం వచ్చిందేమోనని నుదిటిపై చేయి పెట్టి పరీక్షగా చూశాడు.
చల్లగానే ఉంది. జ్వరం తగ్గింది. జ్వరం ఎక్కువైతే బ్రెయినుకు  సోకుతుంది. డాక్టర్ సరిగ్గా డయాగ్నోసిస్ చేశాడు.పాపకు జ్వరం తగ్గింది. మనసులో డాక్టర్ ను  అభినందిస్తూ  రత్నం బడికి బయలు దేరాడు.
   పాప కనబడటం లేదే! ఎక్కడికి వెళ్ళిందబ్బా అని అటూఇటూ వెదుకుతూ ఇంటి బయటకు వచ్చింది రజని. పాప తన ఫ్రెండ్స్ తో కలిసి బయట కొళాయి దగ్గర ఉంది.
      కొళాయి ట్యాప్ తిప్పుతూ వచ్చే నీళ్ళతో ఆడుకుంటున్నారు. మధ్య మధ్యలో చేతితో నీళ్ళు
తాగుతూ ఉన్నారు.
      “వీళ్ళింతే' అంటూ పాపను కోపంగా పిలిచింది రజని.

            __ రచన :పిళ్లా  విజయ్,
                  సెల్: 9490122229


Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE