స్వదేశీయం.....




 
       28 సంవత్సరాల తరువాత జరిగిన న్యాయం ! 
           సిస్టర్ అభయ!  ఈమె 1992, మార్చి 27 న అనుమానాస్పదంగా మరణించింది.అప్పుడు దాన్ని ఆత్మహత్య అన్నారు.కాని 28  సంవత్సరాల తరువాత  అంటే 2020  ,డిసెంబరు 22 న ఆమె ఆత్మహత్య చేసుకోలేదు ఇది హత్య అని జడ్జిమెంట్ వచ్చింది. 
       అసలు ఏమీటి సిస్టర్ అభయ కేసు ?
         అభయ 19( సంవత్సరాలు )కేరళ కొట్టయంలో DCM కళాశాలలో ప్రి డిగ్రీ చదువుతుండేది.catholic Women's Hostel లో ఉండేది.1992, మార్చి 27 తనకు పరీక్ ఉండటంతో ఉదయం 4 గం.లేచింది చదువుకోవాలని. కాసేపటికి దప్పిక వేసింది.రూం మేట్ సిస్టర్ సెరీల్  వద్దని చెప్పనా చాలదప్పిక కావడంతో down floor ,cellar లో ఉండే కిచెన్ కువెళ్ళింది.లైట్ వేయగానే అక్కడ ఫాదర్ థామస్ కొట్టూర్,సిస్టర్ షెఫి,  ఫాదర్ జోసెఫ్ పుత్రకాయ్ లను అభ్యంతరకర రీతిలోచూసింది.ఈ హఠాత్పరిణామానికి ఆముగ్గురూ  అభయను పట్డుకోపోగా తప్పించుకోవాలనుకునింది.కాని థామస్, పుత్రకాయ్ లు గట్టిగాఆమెను పట్టు కోగా సిస్టర్ షఫి గొడ్డలి తో ఆమె తలమీద కొట్టింది.ముగ్గురూ కలసి అభయను  అక్కడనే ఉన్న  బావిలోకు పడేసారు. 
          ఈ కేసులో ప్రధాన సాక్షి చిల్లరదొంగ  అడక్కా రాజు. 
      ‌‌‌ఇక్కడ అభయ హత్య కు గురి అవుతున్న సమయంలోనే రాజు ఆ హాస్టల్ లో దొంగ తనంచేద్దామని వచ్చాడు.
           రాజు పెద్ద దొంగ తనాలు చేయడు.బంగారం జోలికి పోడు. రాగితీగలను  ,water మీటర్లను ....ఇలా చిన్నచిన్న దొంగతనాలు చేస్తాడు.అతడిని అడక్కా రాజు అంటారు.అడక్కా అంటే ' వక్క ', వక్కను దొంగిలించటంలోమంచి నైపుణ్యం అట,అందుకని అడక్కా రాజు అంటారు.
           రాజు,దొంతనంచేయాలనే second show సినిమా చూసాడు అతడు దొంగతనం చేద్దాము అనుకున్నది ,అభయు ఉన్న హాస్టల్ బిల్డింగ్ పైన ఉన్న copper wire ను. సరే second show సినిమా‌చూసి ఆ హాస్టల్ కాంపౌండ ల్లోకి దూకాలని  బయట ఉన్నచెట్టు ఎక్కి గోడమీదకు దూకబోతుండగా.....చీకటిలో ఇద్దరు వ్యక్తులు చేతిలో టార్చిలైట్ తో కనపడ్డారు. వారిలొ ఒకరిని ఫాదర్ ధామస్ గా గుర్తు పట్టాడు రాజు.ఫాదర్ ధామస్ కొట్టాయంలో ప్రముఖవ్యక్తి.ఓ చిన్న సైజు సెలబ్రిటీ. అభయ చదువుతున్న DCM కాలేజ్ లో సైకాలజీ లెక్చరర్‌.అంతేకాకుండా కొట్టాయం ఆర్చి బిషప్ కు సెక్రటరీ కూడా ! 
            వీళ్ళిద్దరిని ,అర్దరాత్రి అక్కడ చూసి ఆశ్చర్య పోయాడు రాజు.ఒక్క ' మగ పురుగు ' ను కూడా లోపలకు రానీయని అమ్మాయిల ( nuns )  హాస్టల్ ల్లోకి వీళ్ళు ఎలావచ్చారు,అదీ ఈసమయంలో అని ఆశ్చర్య పోయాడు. వాళ్ళిద్దరూ  ground floor మెట్లు దిగి సెల్లార్ లోకివెళ్ళటం చూసాడు.వీళ్ళు ఎప్పడు బయటకు వస్తారు,ఎప్పుడు ఆ రాగితీగలను దొంగిలించాల సని వాళ్ళు వచ్చేవరకూ చూద్దాం అనుకున్నాడు.తెల్కవాతి 5.30 అయింది,వాళ్ళు బయటకు రాలేదు.ఆలోగా హాస్టల్ సైరన్ మోగింది.' అయ్యో ఈ రోజు waste అయిపోయిందే ' అని నిరాశ పడ్డాడు రాజు.
         అప్పడు రాజుకు తెలియని విషయం బిల్డింగ్ కు అవతలివేపు ఉన్న కిచెన్ లో  సిస్టర్  అభయ హత్య కు గురి అయింది అని.
       ఇక్కడ ,3 rd floor లో సిస్టర్ అభయ రూంమేట్ సిస్టర్ సిరిల్ నిద్రలేచిఛూసింది.5.15 అయింది .అభయ రా లేదు.సిస్టర్ సిరిల్,అచ్చమ్మ ,సిస్టర్ షఫి కలసి  ఆ floor అంతా  వెదికారు కనిపించలేదు. 
     ‌     
   ముగ్గురూ వంటింటివెళ్ళి చూడగా అక్జడ వస్తువులన్ని చిందరవందరగామ ఒడి ఉన్నాయి తలుపుదగ్గర సిస్ర అభయ చెప్పు ఒకటి పడిఉంది.మూసిఉన్న తలుపులో సిస్టర్ అభయ స్కార్ఫ్ ఇరుక్కుని‌ఉంది.ఫ్రిట్జ్ కింద గొడ్డలి పడి ఉండటంతో అంతా భయపడి. పోలిస్ రిపోర్ట్ ఇస్తారు.Sub Inspector  అగస్టిన్ చివరగా బావిలోచూస్తే అందులో అభయ దేహంబావిలో తేలుతూకనిపిస్తుంది.
       బావిలోదూకు నన్ ఆత్మహత్య చెసుకుంది అని తెల్కవారి వార్తాపత్రిక కలలో news ! అభయ తండ్రి, నమ్మడు. అభయ తలవెనుక రెండు బలమైన గాయాలు ఉన్నాయని మెడమీద గోళ్ఖ గుర్తులున్నాయని ,పోలీసులు ఏదో దాస్తున్నారని గొడవ చేస్తాడు.హాస్టల్ లోని నన్ లు అందరుపోలీసులు ఏదో దాస్తున్నారు,ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేఅభయ ఆత్మహత్ చేసుకోదు అని దర్నా మొదలు పెట్టారు. దానితో ఈ వార్త కొట్టాయం నగర్ దాటి కేరళమొత్తానికి వ్యాపించి ంది.దానితో Crime Branch DGP చేతికి కేసు వెళ్ళింది .
       ఇక ఇప్పటి నుండే చూడాలి కేసు ఎన్నెన్ని వంపులు తిరుగుతుందో,తమ్మిని బమ్మిగా ఎలా మారుస్తారు.సాక్షాలు,సాక్షులుఎలా మారిపోతారు.....
          Crime branch వాళ్ళు  కేసు తీసుకోగానే,మొట్టమొదట చేసినపని ఉన్న సాక్ష్యం లన్నిధ్వంసం చేయటం.కిచన్లో పడి ఉన్న గొడ్డలి, అభయ చెప్పులు,స్కార్ఫ్ అన్నింటినీ మాయంచేసారు.అంతే కాక అభయ మృతదేహాన్ని ఫొటో తీసి న ఫొటో గ్రాఫర్ ,పది పొటోలు ఇస్తే అందులో నాలుగు లేకుండాచేసారు. ఆ నాలుగింటిలోనే అభయ తల‌వెనుక రెండు బలమైన గాయాలు,మెడపైన గోళ్ళ గుర్తులు ఉన్నది.
           అప్పటికి అభయ చనిపోయి నాలుగైదురోజులయింది.పేపర్లలో  రకరకాల వార్తలు రోజూ వస్తున్నాయి.ఆ వార్తలు విని రాజు ' అరే ఆరోజు నేను అక్జెనే ఉన్నాను ,ఫాదర్ కొట్డూరును చూసాను ' అన్నాడు అది విన్న ఒక విలేఖరి ' కాంపౌండ్ లో ఫాదర్ ధామస్ కొట్టూరుని ఆ రోజు ఒక దొంచూసాడట  అని పేపర్లో వార్త రాసాడు.అంతే ,crime branch పోలిసులు రాజుని అదుపులోకి తీసుకున్నారు.రాజు చిల్లర దొంగ కదా,అతడికి పోలీసుల కళ్ళు కప్పి పారిపోవటం కొత్తేమణి కాదు.కాని ఈ పరిస్థితి కొత్త.తనకు పరిచయం ఉన్న పోలీసులు కాకుండా,పెద్దపెద్ద అధికారులు‌వచ్చి కొట్టడుతున్నారు.పైగా వాళ్ళంతా రెండఢ రెండు విషయాలు చెపుతున్నారు రాజుకు.ఒకటి అభయను నువ్వే చంపాననిఒప్పుకోవటం,రెండు ధామస్ కొట్డూర్అక్జడ ఉన్నవిషయం ఎవరితోనూ చెప్పకూడదని." ఆ అమ్మాయి నా బిడ్డలా ఉందయ్యా,నేను అబద్దం చెప్పను "  అంటాడు రాజు.crime branch వాళ్ళు రాజు దొంగసొమ్ము అమ్మే యజమానిని పిలిచి ,వాళ్ళనూ వారంరోజులపాటు కొట్టారు.పోలీసులే ఆషాపువానికి10 కిలోల వెండి,6 water metre లను ఇచ్చి రాజు అమ్మనట్డు చెప్పమన్నారు.
       రాజు పైన అలా 40 పైగా తప్పెఉ కేసులుపెట్టి విపరీతంగా కొట్టే వాళ్ళు.రోజంతా తలకొందులుగా వేలాడతీసి కొట్టడం గోళ్ళుపీకి కారం పూట ం,కాళ్ళూ చేతులు కట్టేసి పాదాలపైన లాఠీలు విరిగేలా కొట్టడం.ఆ హింస అలా 54 రోజులు సాగించారు.ఎంతహింసించినా రాజు పోలీసులు చెప్పనది ఒప్పుకోలేదు.ఇలాకాదని " నీకు రెండు లక్షలు ఇస్తసము,నీభార్యకు ప్రభుత్వ ఉద్యోగం, నిపిల్లల చదువు సన్నీ చూసుకుంటాము అని ఆధపెట్టినా "అదేమీ వద్దయ్యా,చనిపోయిన ఆ బిడ్డకు నేను అన్యాయం జరగనివ్వను " అని గట్డిగా తెల్చిచెప్పాడు.
      ఆ crime branch ,అభయది ఆత్మహత్య గానే ప్రకటించింది.
          అభయ తల్లిలాగ మానసికరోగి అని,చదువులో అంతంతమాయ్రమేనని CB చెప్పటంతో నన్స్ అంతా అది నిజంకాదని,అభయది ఆత్మహత్య కాదని పెద్దెత్తున ఆందోళన చేపట్టారు.వారి కోరికమేతకు కేరళ CM కేసును CBI కి అప్పగించాడు. .
           ఇక CBI  పాత్ర......
           CBI  కి  DSP కొరియన్ .కేసు CBI చేతికి‌వచ్చిన మూడునెలలకే అభయది కచ్చితంగా హత్యే నని తేల్చి చెప్పటం గమనార్హం. ఒక విలేఖరుల‌సమావేశం ఏర్పరచి ,తాను ఈ కేసునుండి తప్పుకుంటున్నానని,తన ఉద్యోగానికి కూడా రాజినామా చేస్తున్నాననిచెప్పాడు.అంతే‌కాకుండా  తన పై అధికారి ఈ కేసును ' ఆత్మహత్య ' గా చెప్పమని తనపై వత్తిడి తెస్తున్నాడని,అలా చెప్పటం తనకు ఎంతమాత్రమూ ఇష్టం లేదనిబహిరంగంగా ప్రకటించాడు.
           దీనితో కేరళ రాష్ట్ర ం అటగుడికి పోయింది. దేశవ్యాప్తంగా కూడా నిరసనలు. పార్లమెంటు లో కూడా రచ్చ ,రచ్చ.
    ‌    ఇంత జరిగినా CBI ,1996 లో అభయది ఆత్మహత్యేనని,ఇక కేసు మూసేయవచ్చు అని నివేదికను ఇచ్చింది. 
      ‌కేరళ రాష్ట్రం మరొకసారి పెద్దెత్తున ఆందోళనలు, ధర్నాలు....మనవహక్కుల కార్యకర్త  Jomon Puthenpurackal ,మరిఇతర activist లు ఈ తీర్పుకు వ్యతిరేకంగా గట్టిగా ఆందోళనలు చేపట్టారు.Jomon వేల సార్లు కోర్టుకు హాజరయ్యారు,కేసుకోసం తన డబ్బును ఖర్చుపెట్డి అండగానిలచారు.దీనితో కోర్టు CBI ని తీవ్రంగా తప్పుపట్టింది.కేసును సక్రమంగా విచారణ జరపాలని ఆదేశంచింది.
       మూడు సంవత్సరాల తరువాత,CBI అభయది హత్యేనని, దోషులుఎవరో చెప్పలేక పోతున్నా మని ప్రకటించింది.
      రాజు పరిస్థితి ఎలా ఉందో, ఈ సమయంలో ,చూద్దాం.
       రాజును 1993 నుండి,2007 వరకూ CBI విచారణ చేస్తూనే ఉంది. అప్పటికే రాజు పేరు పత్రిక ల్ళో ప్రముఖంగా ప్రచురించడం, టి.వి.ళో ఇంటర్వ్యూ లు ...అందరికీ తెలిసిపీయాడు అడక్కారాజు.దొంగతనాలు పూర్తి గా మానేసాడు.పిల్లలు ' మినానన్నదొంగ అని ఏడిపిస్తున్నారని బడి మానేసారు.రాజు భార్య పని చేస్తున్న ఇళ్ళవాళ్ళు ఆమెను పనికి రావద్దని చెప్పేసారు ! ఒక వైపు CBI విచారణ,కొట్టడం,హింస, మరోవైపు ఇరుగూ పొరుగు చిన్నచూపు హేళన భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేసాడు. భార్య అడ్డుకునింది." నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఆ అమ్మయిని నువ్వే చంపావు అని అందరూ అనుకుంటారు,కేసు మూసేస్తారు,ఆ అమ్మాయికి న్యాయం చేయటంకోసమైనా నువ్వు బ్రతకాలి అని చెప్పింది.. పోలీసులు తనను చంపేస్తారేమోనని భయపడ్డానుఅ ంటాడు రాజు. 
     2007 నుండి వచ్చిన CBI పద్దతి మారింది.న్యాయంగా విచారణ చేపట్టింది.CBi దగ్గర ఉన్న ప్రధానసాక్షి  రాజు,కదా.అతడితోపాటు  మాత్యూస్ కూడా బలమైన సాక్షి.మాత్యూస్ తాను ఘటన జరిగిన రాత్రి ,థామస్ కొట్టూర్ స్కూటర్ను   convey hostel బయట చూసాను అని సాక్షం చెప్పాడు.
        2007 లో CBI , నిందితులు ముగ్గురికి నార్కోఎనాలిసిస్ నిర్వహించింది. ముగ్గురూ తాము హత్య చేసామని చెప్పారు. ఆ CD ని CBI  కోర్టు లో సబ్ మిట్ చేయగా ముగ్గురు నిందితులు ఎదురుతిరిగి తాము చంపలేదని వాదిస్తారు.CBI అవాక్కు అవుతుంది.ఆ CD ని మళ్ళీ enquiry కి పంపారు.ఒక సంవత్సరం తరువాత ,అంటే 2008   ఆ ముగ్గురినీ అరెస్టు చేసారు.
      అభయ హత్యజరిగిన 11 సంవత్సరాల తరువాతజరిగిన మొట్టమొదటి అరెస్ట్ ఇది ! 
         ఈ ముగ్గురికీ bail రావటం, సుప్రీంకోర్టు కి అప్పీలు చేసుకోవటం, విచారణలు జరగటం.....జోసెఫ్ పుత్రకాయ న్యాయ వాది ,అతడినేరానికి తగిన సాక్షాలు లేవని వాదించగా విడుదలయ్యాడు.
          ఈ సందర్భంలో  ఈకేసును మొట్టమొదట విచారించిన అగస్టిన్ ఆత్మహత్య చేసుకున్నాడు.బయటకు అభయది ఆత్మహత్య అనిచెప్పినా,తన డైరీలో అది ' హత్య ' అని రాసుకోవడం బయట పడింది.
        ఇక CBI చూపిన ప్రతి సాక్ష్యాన్ని నిందితుకు తారుమారుచేసారు,ధ్వంసంచేసారు.అభయకు న్యాయంజరగాలని ఎంతగానో కోరుకున్న అభయ రూం మేట్ సిస్టర్ షిరీల్,అనుపమ,షఫి,వంటింటి ఇంచార్జి అచ్చమ్మ మాటమార్చారు.తమ కేమీతెలియదు అన్నారు‌.అంతే కాక ఆ రోజు hostel దగ్గర ధామస్ కొట్టూర్ స్కూటర్ చూసాను అని సాక్ష్యం ఇచ్చిన మాత్యూస్ తనేమీ చూడలేదని,CBI వాఖ్ళు తనతో అలాచెప్పించారు అనితప్పుకున్నాడు. 
             ఇక మిగిలి ఉన్నది రాజు ఒక్కడే, రాజు సాక్ష్యం ఒక్కటే ! 
       11 సంవత్సరాల తరువాత CBI April,2019 లొ,కొట్టాయం CBI ప్రత్యేక న్యాయ స్దానంలో వుచారణ చేపట్టింది.
           రాజును రెండు రోజుల పాటు డిఫెన్స్ లాయర్లు ,cross examination లో ప్రశ్నల వర్షం కురిపించి తికమకచేసారు.రకరకాల ప్రశ్నలతో గందరగోళ పరిచారు. 
             వాళ్లు ఎన్నివిధాలుగా,ఎలా ప్రశ్నంచిన రాజుది ఒక్కటే మాట - " తాను ఆ రోజు రాత్రి ధామస్ కొట్టాయంను చూసాను,చూసాను అని కచ్చితంగా చెప్పటం.
          కోర్టు రాజు మొండితనాన్ని నమ్మంది.
     28 సంవత్సరాల అభయ హత్యకేసుకు,2020, డిసెంబరు22  న ముగింపుకు వచ్చించిది .తీర్పు వెలువడింది‌. థామస్ కొట్టూర్,సిస్టర్ షఫిలను దోషులుగా నిర్ణయించి ఇరువురికీ యావజ్జీవకారాగార శిక్ష తోపాటుగా ,ఇద్దరికి పదిలక్షల జరిమానా విధంచింది.  
      ఈ కేసులో రాజుతో పాటు గట్డిగానిలబడిన మరీ వ్యక్తి మానవహక్జుల కార్య కర్త zonom అని చెప్పుకున్నాముకదా.CBI కుంటిసాకులు చెప్పిన ప్రతిసారి,పెద్దెత్తున ఆందోళనలు చేపట్టాడు.ఈ 28 సంవత్సరాల లో వేల సార్లు కోర్టు మెట్టు ఎక్కాడు, వందలాది పిటిషన్ లు వేసాడు,తన స్వంతడబ్బును కేసుకోసం వినియోగించాడు.అన్న  అతడిని చంపబోయాడు‌, తల్లితండ్రులు కూడా దూరమయ్యారు.తనస్వంత మతసంస్దకు వ్యతిరేకంగా పోరాడాడు......చివరికి గెలిచాడు! 
           తీర్పు వచ్చే నాటికి అభయ తలిదండ్రులు లేరు చనిపోయారు.అభయకు న్యాయం జరిగిన విజయసందర్బాన్ని పంచుకునేకి ఎవరూ లేరు అన్నప్పుడురాజు ' నేను ఉన్నాను,ఆబిడ్డ నాకూతురు. నాకూతురికి న్యాయం జరిగింది అని సంతోషంతో కన్నీళ్ళు పెట్టుకున్నాడు.
         ఇక నన్ను  ' దొంగ రాజు ' అనవద్దని పోలీసు అధికారులను కోరాడు.
       కేసులో నెగ్గావు,థామస్ కి శిక్షపడింది ,ఎలా ఫీలవుతున్నావు అని విలేఖరులు చుట్ట ముట్డి ప్రశ్నించి నప్పుడు " చాల సంతోషంగ ఉంది. ఇంటికి వెళ్ళి తాగి పడుకుంటా " అన్నడు సంతోషంపట్టలేక 
      రాజు ఇప్పటి కీ పేదరికంలో నే ,పూరిగుడిసలోనే నివసిస్తున్నాడు.
       అయితే ఏమిటి మన రాజు ' రాజే ' .🤗🤗🤗

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE