శవం ఎక్కడకు వెళుతోంది?


 శవం ఎక్కడకు వెళుతోంది? 

ఒక పూటకూళ్ళమ్మ ఇంట్లో భోజనం కోసం వెళ్లాడో పండితుడు. పండితుడు ఆమె ఇంట్లో భోజనం  చేస్తున్నాడు. ఇంతలో ఆ ఇంటి ముందు నుంచి ఒక శవాన్ని డబ్బులు వాయించుకుంటూ ఎవరో తీసుకెళ్తున్నారు. పూటకూళ్ళమ్మ తన పని మనిషితో పిలిచి పిలిచి ఆ శవం స్వర్గానికి వెళుతుందో లేదా నరకానికి వెళుతుందో పోయి చూసి రా అని చెప్పింది.
ఆ పని మనిషి చూసి వచ్చి "అది స్వర్గానికి పోయే పీనుగేమ్మా " అని చెప్పింది.
భోజనం చేస్తున్న ఆ పండితుడు వారి సంభాషణ విని ఆశ్చర్యపోయాడు. ఆ శవం స్వర్గానికి వెళ్తుందా నరకానికి వెళ్తుందా ఎలా తెలిసింది  అనుకుంటూ పూటకూళ్లమ్మ తో "పని మనిషి ఎలా చెప్పింది" అని శవం గురించి  అడిగాడు.
"అదేం పెద్ద విషయం .అయ్యో, పుణ్యాత్ముడు పోయాడే అని నలుగురు అంటుంటే ఆ శవం స్వర్గానికి పోతుంది. పాపిష్టి ముండాకొడుకు సచ్చినాడా, అని నలుగురు అంటుంటే ఆపీనుగు
 నరకానికి పోతుంది" అందామె.
"ఔరా !ఎంత తెలివి వీరిది"అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడా పండితుడు. "నిజమే తల్లి, మీరు చెప్పింది అక్షరాల నిజం .మంచి వాళ్లకు శుభం జరిగితే ఊర్లో వారు కూడా సంతోషిస్తారు .దుర్మార్గుడు మరణిస్తే ఊరంతా సంతోషిస్తుంది.మీకు అక్షర జ్ఞానం లేకపోయినా లోకజ్ఞానం చాలా బాగుంది" అంటూ వారిని మెచ్చుకున్నాడు.
(నెల్లూరు తాతాచారి చెప్పగా సి.పి.బ్రౌన్ 1855లో ఈ కథను రాసుకున్నాడు. బంగోరె 1974లో తాతా చారి కథలు పుస్తకం పేరుతో ఒక కథా సంపుటిని ప్రచురించారు)

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE