అన్నా చెల్లెళ్ల మధ్య సంబంధం
10వ సూక్తం
10వ మండలం 14మంత్రాలు పుటలు: 238-240
సంపూర్ణ సంభాషణ కథనరీతి, ఆధునిక కథల్లోనే కాదు ఋగ్వేదంలోనే రూపు దిద్దుకున్నట్లు ఈ కథవల్ల తెలుస్తుంది. యముడు అన్న యమి చెల్లెలు. అన్నా చెల్లెళ్ల మధ్య ఎటువంటి సంబంధం .ఉండాలి - అన్న విషయం పైన సంభాషణ జరుగుతుంది. కుటుంబంలో సమాజంలో పురుషుడికి తన భార్యతో మాత్రమే కామసహిత ప్రేమానుబంధం ఉండాలని మిగిలిన స్త్రీలందరితోనూ గౌరవప్రదమైన కామరహిత ప్రేమానుబంధం ఉండాలి - అన్న నియమం స్పష్టమౌతుంది. కుటుంబంలో సమాజంలో - భద్రతాయుతమైన శాంతియుత సహజీవనానికి ప్రాథమిక నియమం ఇదే. ఇదే మానవ సంస్కృతికి మూలం. ఈ నియమం ఈ సహజీవన సంస్కృతి లేకపోతే మనిషికీ మృగానికి మధ్య తేడా ఉండనే ఉండదు. ఈ కథ ఈ విషయంపైన లోతుగా ఆలోచింపజేస్తుంది. ప్రాచీన రుషుల దార్శనికత మన మనసులో నిలిచిపోతుంది
Comments
Post a Comment