చుతియా(Chutiya)



ఆమెది ఉత్తరప్రదేశ్ లోని మారుమూల గ్రామం.. తాతలు తండ్రులు అనాదిగా భూస్వాముల పొలాల్లో పని చేసేవారు.. ఆమె ఇంటి స్త్రీలను భూస్వామి.. భూస్వామి బంధువులు.. భూస్వామి స్నేహితులు.. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాలి.. వారితో పడుకోవాలి.. ఆమెకు.. ఆమె తోబుట్టువులకు ఆమె పిల్లలకు  నాన్న భూస్వామో.. లేక తమతోపాటు గుడిసెలో ఉంటూ నాన్న అని పిలిపించుకున్న వ్యక్తో వారికి తెలీదు 

         ఆమె ఇంట్లో బిడ్డ పుడితే ఆ బిడ్డకు భూస్వామి పేరు పెట్టే వాడని చెప్పింది.. ఆమె ఇంటి పేరు ఓ తిట్టు "చుతియా" .ఈ పదానికి అర్థం పిల్లలు పుట్టడానికి ఉపయోగపడే  స్త్రీ జననాంగం.. ఈ ఇంటి పేరును ఆ భూస్వామే ఎప్పుడో అనాది కాలంలో ఇచ్చాడు వారికి.. 
       ఈ బానిసత్వం ఇంకెంత మాత్రం వద్దనుకుని ఆమె నగరానికి పారిపోయింది.
        వస్తే.. ఆమెకు నగరం ఇచ్చిన ఉద్యోగం.. "వళ్ళు పెట్టుబడిగా పెట్టి పొట్ట పోషించుకునే ఉద్యోగం".. 
   ‌      అక్కడికి ఇక్కడికి తేడా ఏమంటే    ఇప్పు  డామెకు తన ఇంటి పేరు "చుతియా" పై ఎలాంటి షికాయత్ లేదు.తనేదైనా పెట్టుకోవచ్చు.
  ‌‌    ఆమె తన లాంటి వారిని సమీకరిస్తూ.. తమ హక్కుల గురించి పోరాడుతూ.. అదే ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని జీవిస్తోంది.. 
      ఆమెతో కాసేపు కూర్చుని మాట్లాడితే వర్కింగ్ క్లాస్ బతుకే ఒక తిట్టు.. అని పక పకా నవ్వుతుంది.. పది మందిని కలుపుకు పోవాలంటే తిట్లను ఆయుధంగా చేసుకోవటం అజ్ఞానమవుతుంది... నవ్వును ఆయుధంగా చేసుకోవటం అతికష్టమే.. అయినా సరే వర్కింగ్ క్లాస్ కు  ఈ ఆప్షన్ మినహా మరో ఆప్షన్ లేదు..

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE