ద్వంద్వ నీతి






మిట్టపల్లె లో బస్సెక్కారు రామప్ప,సీతమ్మ దంపతులు.

'కదిరికి ఒక టికెట్ ఇవ్వండి' అన్నాడు రామప్ప కండక్టర్ తో.
'15 రూపాయలు ఇవ్వు' అన్నాడు కండక్టర్
రామప్ప పదైదు రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకున్నాడు.

నా భార్య క్కూడా ఒక టికెట్ కావాలి. ఆమెకు టికెట్ ఎంత?
'నీకెంతో ఆమెకూ అంతే. నీకో రేటు ఆమెకో రేటు ఉంటుందేమప్పా?'

బస్సు లో అందరూ నవ్వినారు.

'ఏమో సారూ మా ఊర్లో పనికి పోతే ఆమెకు నా కన్నా తక్కువ ఇస్తారు కూలీ.ఈడ కూడా ఆమెకు టిక్కెట్ తగ్గుతాదేమోనని' నసుగుతూ అమాయకంగా అన్నాడు.

బస్సు లో అందరూ తెల్లముఖం వేశారు.
కండక్టర్ ఆశ్చర్యపోయాడు. సమాజంలో ద్వంద నీతి అర్ధమైంది అందరికీ.

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE