సుఖమనుకోవోయ్
జీవితాల్లో కష్టాలు మనుషులకే వస్తాయి గాని మానుకెలాగూరావు గదా!
జీవితంలో కష్టాలు లేకుంటే సుఖమనేది మనకు తెలిసేది కాదు గదా!
కష్టమనేది ఒకటుందా అనేది సందేహమే.
కష్టాన్నే సుఖమనుకుంటే ....
ఈ విషయం కరోనా వచ్చినంత వరకు తెలీదు.
బస్సు మిస్సయితే ఆందోళన ఎందుకు మరో బస్సు వుంటుందిగా!
పరీక్ష ఫెయిలయితే బాధేందుకు, మళ్లీ రాయవచ్చుగా !
ప్రేమ విఫలమయితే జీవితాన్ని వదులుకోవాలా? నిన్ను ప్రేమించేవాళ్లు ఎంతో మంది వున్నారు. ప్రేమ కోసం పరితపించే
వాళ్లు ఎంతో మంది వున్నారు కదా !
నూతులు, గోతులు చూడడమెందుకు ?
నువ్వు కొన్నభూమి అమ్ముడు పోలేదా, రేటు పెరగలేదా ?
అసలు నువ్వు పుట్టినప్పుడు ఏ భూమిని తెచ్చావు నీతో పాటు ?
పత్రికలో నీ కథ అచ్చపలేదా ? ఎన్ని పత్రికలులేవు నీ కథ కోసం ఎదురుచూసేవారు ? వాళ్లు వేయలేదా?
సోషల్ మీడియాలో పెట్టు ప్రపంచం చూస్తుందిగా !
నీతో మాట్లాడేవారే లేరా ! ఎందుకు కంతబాధ ?
నువ్వే మాట్లాడి వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టు
నీపు మాట్లాడేందుకు నీకే టైముండదప్పుడు,
ఏమి జరిగినా వ్యాకులత వస్తోందా ?
అంతా మన మంచికే అనుకో, బాధలన్నీ ఎటో వెళ్లిపోతాయి.
అమ్మాయి పెళ్లి కాలేదని బాధ పడుతున్నావా ?
పెళ్లయిన వాళ్లందరినీ చూడు ఎన్ని విడాకులో
ఓపిక పడితే కాలం నీకు ఆనందాన్నిస్తుంది !
స్టాక్ మార్కెట్ పడిపోయిందా !
ఒక్కటి గుర్తుంచుకో, నీకిప్పుడు నష్టం జరుగుతూవుంటే ఓపికప్టు,
ఎప్పుడో ఒకసారి నీకు లాభం వస్తుంది.
ఉత్తాన పతనాలు ఎన్ని చూడలేదు జీవితంలో అయినా ఇంటి వెలుగు ఆరిపోలేదుకండి !
కరోనా ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పుడు
లాక్ జొస్ చేశాక నువ్వు ఇంట్లో వుంటే ఎంత సుఖం
ఆసుపత్రిలో దగ్గుతూ దగ్గతూ చస్తూ బతుకుతూ వుండడం లేదుకదా!
ఇంట్లో అందరితో కలిసిమెలిసి బతకడం ఎంత సుఖం, ఎంత ఆనందం, అదేకదా జీవితానందం,
రోడ్డుమీద వేల కి.మీ. నడిచే కార్మికుల బాధలు చూడు,
వాళ్లకంటేనా నీ బాధలు.
- పిళ్లా విజయ్,
సెల్ : 9490122229
Comments
Post a Comment