ఏది ముఖ్యం?
ఒక చింత చెట్టు కింద ఒక అమ్మాయి చింతచిగురును కోసి వాటిని కుప్పలు చేసి ఒక పట్ట పై పెట్టుకొని ఉంది.
రాము రమేష్ బజార్ కు వచ్చారు. ఇద్దరూ వెళ్లి 'కుప్ప ఎంత'అని అడిగారు.
'కుప్ప 2 రూపాయలు'అందా అమ్మాయి.
'ఆ చెట్టు మీద ఉన్నది రెండు రూపాయలా?' తగ్గించుకో అన్నాడు రాము.
"చెట్టెక్కి కోసుకోపో అన్నా! ఫ్రీగా వస్తుంది"
"ఉండరా. 2 నిమిషాల్లో కోసేస్తా" అన్నాడు రమేష్.
'వరేయ్,అంత అవసరమా!'
నువ్వు చెట్టెక్కి ఒకవేళ పొరపాటున కింద పడితే కాలు విరుగుతుంది. దాని కయ్యే ఖర్చు వేలల్లో అవుతుంది. రెండు రూపాయల కోసం ఎందుకురా బాధ?' అన్నాడు రాము.
రమేష్ నిజమేన్నట్లు రాము వైపు చూశాడు.
మనం సాయం చేయాల్సింది ఇలాంటి వారికేరా. ఎంతో డబ్బులు పోతుంటాయి.
రెండు రూపాయలకు ఏమొస్తుంది రా! మెడికల్ స్టోర్ లో అయితే మనము అడుగుతామా?బంగారం షాపులో బేరం పెడతామా! ఎందుకురా బేరం?"అన్నాడు రాము.
అన్ని కుప్పలు ఎంతమ్మాయ్? అన్నాడు రమేష్.
'ఇరవై'అందా అమ్మాయి.
'అన్నీ ఇచ్చేయమ్మా' అంటూ అన్ని కుప్పలు తీసుకున్నారిద్దరూ.
ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వు వెలిసింది.
___ పిళ్లా విజయ్, 9490122229
Comments
Post a Comment