కథల పై కాళీపట్నం రామారావు


        కాళీపట్నం రామారావు pc Wikipedia


కథల పై కాళీపట్నం రామారావు

చదివిన తరువాత పాఠకుడిలో గాఢమైన స్పందనని కలిగించి అతని సంస్కారాన్నిగానీ, జీవిత అవగాహనని గానీ పెంచేది - చదివించేది - వాటితో పాటు కర్తవ్యోన్ముఖుని చేసేది మంచి కథ.

కథకి రూపు ఇవ్వడంలో సన్నివేశాలూ, సంఘటనలే ప్రధానమైన సామాగ్రి
కథనం  మూడు రకాలు. 
ఉత్తమ పురుష కథనం, 
అప్రత్యక్ష (లేక తిరోహిత) సాక్షి కథనం, సర్వాంతర్యామి కథనం.

భిన్న స్వభావాలూ, భిన్న ప్రయోజనాలు కల పాత్రల మధ్య కథ పుట్టడం, నడవడం సుఖం.

కథా నిర్మాణానికి ఉపయోగపడే వాటిని కథా సామగ్రి అనవచ్చు. వర్ణనలూ, పాత్రలూ, సన్నివేశాలూ, సంభాషణలు, సంఘటనలుగా ఉండే సామాగ్రి కథలో భాగాలవుతూనే కథకు రూపాన్నేర్పరుస్తాయి.

ప్రాణం, ప్రాణిలా ఉండే ఆ విశేషం, దాన్ని వ్యక్తం చేసే వృత్తాంతం కథ అయితే -ఆ విశేషం, వృత్తాంతం రెండూ వ్యక్తం అయ్యే విధంగా వాటిని చెప్పడం కథనం లేక కథ రాయడం.

తమకు జరిగే మంచి చెడ్డలకు లోకంలో ప్రతివారూ స్పందిస్తారు. ఆ స్పందన కొందరిలో ఇతోధికంగానూ, మరికొందరిలో సాధారణంగానూ ఉంటుంది.సాధారణతను మించి స్పందించే వారెవరైనా రచయితలయ్యే అవకాశం ఉంది.

కథ మొదటి వాక్యం లేదా పేరాతోనే చదువరిని ఆకట్టుకోగలగాలి.

జీవితం గురించి, మానవ మనస్తత్వం గురించి, వ్యవస్థ గురించి, 'పోరాటం గురించి కొత్త అవగాహన కల్పించేది, మనలో మార్పును తేగలిగేది మంచి కథ. పాఠకుల అనుభూతి కోసం రాసే కథ మంచి కథ అనే వాదనతో నేను ఏకీభవించలేను.

(కాళీపట్నం రామారావు)
             ‌

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE