సాధన








ఒక రోజు  రవివర్మ బజారులో వెళుతూ ఉన్నాడు. ఆయనొక ప్రసిద్ధ చిత్రకారుడు.
          రవివర్మను గుర్తుపట్టిన ఒక యువతి సంతోషంతో ఆయన దగ్గరకు వెళ్ళి పలకరించింది. 
    " ఏదైనా ఒక చిన్న పేయింటింగ్ గీసివ్వండి" ఆమె అభ్యర్థించింది. 
         "బజారులో పెయింటింగ్ ఎలా చిత్రిస్తాను ? మరోసారి కలిసినపుడు తప్పక చిత్రాన్ని వేసిస్తాను"అన్నాడాయన. 
       ఆ యువతి మొండిపట్టు పట్టింది.
     ‌  ఆమె కోరిక కాదనలేక   ఒక పేపర్ పై అప్పటికప్పుడు ఒక చిత్రాన్ని చిత్రించి ఇచ్చేశాడు. 
ఇస్తూ ఇస్తూ ....నవ్వుతూ అన్నాడు "దీని విలువ కోటి రూపాయలు.జాగ్రత్తగా కాపాడుకో".
 ఆ యువతి ఆశ్చర్యంగా పెయింటింగ్ వంక చూస్తూ నిజంగా అంత విలువ చేస్తుందా?మనసులో అనుకుంది.

 మరుసటి రోజు ప్రముఖ చిత్రకారుల చిత్రాలు అమ్మే వ్యక్తిని కలిసి ఈ రవివర్మ చిత్రాన్ని అమ్మితే ఎంత ధరకు అమ్ముడు పోతుందని  అడిగింది. ఆయన కూడా రవివర్మ చెప్పినట్లే చెప్పినాడు. ఆమెకు నోటమాట రాలే. మళ్ళీ రవివర్మ గారిని కలవడానికి వెళ్ళింది. 

    రవివర్మ తో "మీరు పది నిమిషాల్లో గీచిన చిత్రానికి ఇంత విలువ ఉంటుందని అనుకోలేదు. నాకు కూడా చిత్రకళలోని మెళకువలు నేర్పండి. మీలా పది నిమిషాల్లో కాక పోయినా....పది రోజులకొక  చిత్రాన్నైనా గీస్తాను"అందామె.

 రవివర్మ నవ్వుతూ "  నీకు పది నిమిషాలలో చిత్రాన్ని గీసిచ్చాను. నిజమే. దీని వెనకాల నా 30 సంవత్సరాల కఠోర సాధనుంది. నువ్వూ నీ 30 సంవత్సరాలు ఈ కళ కోసం త్యాగం చేయగలిగితే నాలా తయారవుతావు" అన్నాడు.

      ఆమెకు నోటమాట రాక అలాగే చూస్తూ ఉండి పోయింది.

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE