కన్పించని కోణాలపై ఫోకస్ చేసేదే కథ

       కన్పించని కోణాలపై ఫోకస్ చేసేదే కథ     
                                           - కుప్పిలి పద్మ

      కథతో ప్రయాణం ఒక్కొక్కరిదీ ఒక్కొక్క శైలిలో వుంటుంది. భావుకత పొగడ పూల పల్లకిలా
సాగినా, పారిజాతం పూలలా పరవశింపచేసినా, పులకించే ప్రకృతి కొత్త శోభలువెదజల్లినా, మల్లెల పరిమళాలు మంచు పూలవానలా మనల్నిహత్తు కున్నా, సౌందర్య కాంతులు కుసుమాలై విరజిమ్మాలి. స్త్రీ వాదం అంటే పురుష ద్వేషం కాదు, అందరికీ ఒక డెమోక్రటిక్ స్పేస్ కల్పించడమే స్త్రీ వాదం.
'కథ ఎప్పుడూ కన్పించని కోణాలకు ఒక టార్చ్ లైటు ఫోకస్ చేయగలగాలి. చదివేవాడికి ఒక మెలకువ నివ్వగలగాలి.

గ్లోబలైజేషన్ ప్రభావంతో ప్రభుత్వం నాణ్యతలేని చదువుని, తిండిని మనమీద వెదజల్లుతోంది.ప్రశ్నించే ధోరణి నుంచి మనల్ని దూరం చేస్తోంది. పైకి విస్తారంగా అవకాశాలు స్త్రీలకు గ్లోబలైజేషన్ వలన కలిగినా, గతంలో కన్నా ఎక్కువగా అది పితృస్వామ్య భావజాలాన్ని కుమ్మరిస్తోంది. దీనిపట్ల 
ఎరుకతో వుండటంతో పాటు రాయగలిగే సామాగ్రిని సమకూర్చుకోపోతే స్త్రీ వాద కథా రచయిత్రులు
రాసిందే రాస్తారు. చెప్పిందే చెబుతారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. లేకపోతే అసలు రాయటం లేదు. స్త్రీల పై జరిగే దాడుల మీద, దోపిడీ మీద న్యూస్ పేపర్లు వార్తాకథనా లిస్తున్నాయి. '24X7 న్యూస్ ఛానల్స్ కథనాలను ప్రసారం చేస్తున్నాయి. ఒక సంఘటనని ఆధారం చేసుకుని కథలు రాస్తున్నారు. కథ ఎప్పుడూ కూడా కన్పించని కోణాలకు ఒక టార్చ్ లైటు లాగా ఫోకస్ చేయగలగాలి. "చదివేవాడికి ఒక మెలకువనివ్వగలగాలి. ఇలాంటి కథలు చాలా తక్కువొస్తున్నాయి. కథ మనల్నిHunt చేయగలగాలి. ఆ Hunting లేకపోతే రాసిన వాళ్ళకు, చదివిన వాళ్ళకు ఇద్దరికీ తృప్తిగా వుండదు.

ఒక పువ్వు వికసించే ముందు చాలా ప్రాసెస్ జరుగుతుంది. అది చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది.అది మనకు కన్పించదు. అలాంటిదే కథారచన కూడా. ఏ కథకయినా Text తో పాటు Content కూడా వుంటుంది. ఆ Text లో రాసినప్పుడే ఆ కథ వికసిస్తుంది. కథ న్యూస్ పేపర్ రిపోర్టులాంటిది కాదు కదా, తర్వాత కథకు Aesthetics వుంటాయి. ఆ Aesthetics ను నింపుకున్నప్పుడే కథ పదికాలాలు నిలబడుతుంది.

                  పిల్లలలో హింస పెరగటానికి సొసైటీలో వస్తున్న అసమానతలు కారణం. గతంలో ఆడపిల్లల మీద హింస అంటే దారిన పోయేవారి కామెంట్లగానో, ఆకాశరామన్న ఉత్తరాలగానో వుండేవి. ఇప్పుడా పరిస్థితి ఎంతకు దారితీస్తోందంటే కొంచెం తేడా వస్తే ఆడపిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
హింస చేస్తున్నవారి మానసిక పరిస్థితుల్ని విశ్లేషణ ఎవరూ చేయడం లేదు. జీవితాన్ని వస్తువుల వైపు, Consumerism వైపు తోసేస్తున్నాం. మన కళ్ళని టీవీకి కట్టెయ్యడం కాకుండా మన పిల్లల్ని పుస్తకాల వైపు నడిపించాలి. అవి రకరకాల లైఫ్ స్టయిల్స్ ని పరిచయం చేస్తాయి. వంద రకాల కేరక్టర్లని
పరిచయం చేస్తాయి. మనకు Inner Strength ని ఇచ్చేది ఎప్పుడూ పుస్తకమే. పిల్లలు పుస్తకాల్ని చదివే అవకాశాలను ఇంట్లోనూ, అటు స్కూల్లోనూ కూడా కలిగించాలి. వీధి చివరన వుండేలా లైబ్రరీలను ఏర్పాటు చేసి చదువుకునే అవకాశాన్ని కలిగించాలి.
           
         పెద్దయితే ఏమవుతావు? అని ఒకాయన అడిగినప్పుడు రైటర్ అవుతాను అన్నాను. కోర్టులో 'రైటరా' అని అడిగాడు. కాదు షార్ట్ స్టోరీస్ రైటర్, నావెల్ రైటర్, పొయిట్రీ రైటర్ అని చెప్పాను. అలా రైటర్ని అయ్యాను . ఇప్పుడు జీవితమంతా సాహిత్యంలా బతకాలని ఆశ. అంటే సాహిత్యాన్ని చదువుతూ, రాసుకుంటూ వుండాలని, ఈ ప్రపంచాన్ని ధ్వంసం చేసే సాధనాలు చాలా వున్నాయి. కానీ ప్రేమను పంచే సాధనాలు మాత్రం తక్కువే! సాహిత్యం ఒక ప్రేమని అందించే సాధనం అని నా విశ్వాసం.నా నమ్మకం కూడా....


   

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE