ఓర్పు


            pc: kandukuriramu.wordpress.com

ఓర్పు

           ఒక కోటీశ్వరుడికి ఇన్సూరెన్స్ పాలసీ చేయమని వెంటబడే ఏజెంట్స్ అంటే ఒళ్ళుమంట ...! ఏ ఏజెంటునీ తన గదిలోకి పంపించ వద్దని సెక్రటరీకి స్ట్రిక్ట్ గా చెప్పాడు. 
          ‌కొన్నేళ్ల తర్వాత పాత సెక్రటరీ మారి ఆమె స్థానంలో మరో కొత్త సెక్రటరీ వచ్చింది. ఆమెకి ఈ ఇన్సూరెన్స్ విషయం తెలియదు. ఒక ఏజెంట్ ని లోపలికి పంపించింది. కోటీశ్వరుడి భార్య పెళ్ళయ్యాక మొట్ట మొదటిసారి ప్రొద్దున్నే కాఫీ ఇస్తూ నవ్వింది. అందుకని ఆరోజు ఆయన మంచి మూడ్ లోఉండ బట్టి అతడికి ఇంటర్వ్యూ ఇచ్చారు.
            అయిదు నిముషాల్లో ఆ ఏజెంటు కోటీశ్వరుడ్ని ఒప్పించాడు. 
             కొన్ని లక్షలకు చెక్కు రాస్తూ ....
“ఇన్సూరెన్స్ లో ఇన్ని లాభాలు ఉంటాయని నాకుతెలియదు! నువ్వు అదృష్టవంతుడివి ... నా సెక్రటరీ మారడం వలన, నేను మంచి మూడ్ లో ఉండటం నీకు కలిసొచ్చాయి. నీకు తెలుసో లేదో .., మా సెక్రటరీ ఇప్పటి వరకూ 162 మంది ఏజెంట్లని బయట నుంచే పంపించి వేసింది " అన్నారు.
         ఏజెంట్ చెక్ అందుకుంటూ ...." ఆ 162 సార్లు వచ్చింది నేనేనండి ... " వినయంగా అన్నాడు. 
        అదీ ఓర్పంటే ...

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE