డాక్టర్ దేవరాజు మహారాజు ఉవాచ! "#ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా? ++++++++++++++ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా - దేశంలోని అన్ని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లకు ఏడాది క్రితం ఒక సర్కులర్ పంపింది. తక్షణం విద్యార్థులందరికీ ఆవుపై ఓ పరీక్ష నిర్వహించాలన్నది - అందులోని సారాంశం! స్వదేశీ గోవుల ప్రాముఖ్యం గురించి, దాని చుట్టూ అల్లుకున్న వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణం వంటి అంశాల గురించి - అంతే కాదు, ఆధ్యాత్మిక చింతనపై కూడా ప్రశ్నలుంటాయని యూజీసీ తెలిపింది. ఈ పరీక్షను రాష్ట్రీయ కామధేను ఆయోగ్ (ఆర్కెఎ) నిర్వహిస్తుందని, పాఠశాల, కళాశాల విద్యార్థినీ విద్యార్థులందరూ ఆ పరీక్ష రాయాలని యూజీసీ కోరింది. పదకొండు ప్రాంతీయ భాషల్లో, ఇంగ్లీషులో జరిగే ఈ పరీక్ష 25 ఫిబ్రవరి 2021న జరుగుతుందనీ, అందరూ ఆ పరీక్షరాసే విధంగా ప్రోత్సహించాలని వైస్-ఛాన్సలర్లను యూజీసీ ఆదేశించింది. ఇంతకూ యూజీసీ ఎందుకు అలా చేసిందీ అంటే, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ గనక, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యూజీసీ కార్యదర్శి రజనీష్ జైన్ ...
చిత్రా రామకృష్ణ. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్-NSE ఎండీ, సీఈవో. 2013లో ఫోర్బ్స్ మ్యాగజీన్ ‘విమన్ ఆఫ్ ది ఇయర్’ ఆమె. భారత్‌లో రెండో శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్త. ఇదంతా గతం. ఇప్పుడామె సెబీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఆమెపై నిషేధమూ ఉంది. శాలరీలో కొంత భాగం ఆపేశారు. ట్రేడింగ్ సామ్రాజ్యాన్ని ఏలిన ఆమె.. ఇప్పుడిలా దోషిలా నిలబడటానికి కారణం.. ఓ హిమాలయ యోగి. ఆమె చెబుతున్న 'అదృశ్య' స్టోరీ. చిత్రా కెరీర్ ఛార్టెర్డ్ అకౌంటెంట్‌గా స్టార్ట్ అయింది. 1985లో ఐడీబీఐ బ్యాంక్‌కు చెందిన ప్రాజెక్ట్ ఫైనాన్స్ డివిజన్లో చేరారు. ఆ తర్వాత కొంతకాలం సెబీలో పనిచేసి.. మళ్లీ ఐడీబీఐ బ్యాంక్‌కు తిరిగొచ్చారు. బీఎస్ఈలో హర్షద్ మెహతా కుంభకోణం తర్వాత.. పారదర్శక ట్రేడింగ్ కోసం కేంద్రం ఐదుగురితో ఎన్ఎస్ఈ ఏర్పాటు చేయగా.. అందులో చిత్ర రామకృష్ణ ఒకరు. 2009లో చిత్ర.. NSEకి ఎండీగా బాధ్యతలు చేపట్టారు. 2013లో NSE సీఈఓగా ఎదిగారు. 20 ఏళ్ల పాటు ఎన్ఎస్ఈకి వర్క్ చేసిన చిత్ర.. 2016 డిసెంబరులో అనూహ్యంగా ఎండీ, సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో సెబీ ఆమెపై చర్య...
Comments
Post a Comment