ఏడుతరాలు!!(Roots)




"ఏడుతరాలు" ఒక బానిసల కథ 
జాలీ దయా తెలియని అమెరికన్ల దుష్ట స్వభావానికి పరాకాష్ట!!
తమ పల్లెల్లో హాయిగా స్వేఛ్చగా ఆడుతూ పాడుతూ జీవించే ఆఫ్రికన్లను జంతువులను వేటాడినట్లు వేటాడి, చీకటి ఓడలలో అమెరికాకు బందీలుగా తీసుకువచ్చి.. బానిసలుగా చేసుకున్న అమెరికన్ల కధ ఇది.
అలా వచ్చిన మొదటి బానిస కుంటా. ఆ వంశంలో ఏడవతరానికి చెందిన అలెక్స్, తన ముత్తవ్వ చెప్పిన కధలో వాస్తవాలు తెలుసుకోవడానికి గాంబియా వెళతాడు. 
అక్కడ తన తెగకు చెందిన మనుష్యులు ఇంకా అంతే స్వఛ్చంగా నాగరికతలో కలుషితం కాకుండా - ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు.
తమ తెగలో వారిని వరుస క్రమంలో పాడుకుంటూ "కుంటా" ప్రస్తావన వచ్చేసరికి అతనిని ఎవరో ఎత్తుకు పోయారని చెబుతూ ఉంటే... సాక్ష్యాలతో సహా కనిపించిన ఆనాటి దురదృష్ట సంఘటనలు తలచుకుని అలెక్స్ కన్నీరు మున్నీరు అవుతాడు.
రూట్స్ పుస్తకంలో ఒక మానవతా వాదం... ప్రతీ హృదయాన్ని సూటిగా స్పృశించే ఒక కరుణరసం ఉంది. 
మతాలకీ, రంగులకి, దేశాలకి, భాషలకి అతీతమైన ఒక హృదయ స్పందన ఉంది.
జంతువుకంటే హీనంగా హింసించబడిన, గాయపడిన ఒక గుండె చప్పుడు ఉంది.
పీడన, నిర్భందం, దోపిడి, వెట్టి వాకిరీ... ఇవి సమూలంగా నిర్మూలింపబడాలి అనుకునే ప్రతీ ఒక్కరికీ "రూట్స్" ఒక ఉత్తేజం లాంటిది.
ఎన్ని సార్లు చదివినా... చదివిన ప్రతీసారి..
కెరటాలు కెరటాలుగా దుఃఖం...
జ్వాలలు జ్వాలలుగా ఆవేశం ...
ఒక్క మాటలో చెప్పాలంటే... ఆఫ్రికా దుఃఖబీడుల నేల దైన్యాన్ని చూపే పుస్తకం ఇది...

కథ

కుంటా కింటే అనే నల్లజాతి యువకుడు పశ్చిమ ఆఫ్రికాలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందినవాడు. అతడు ఓ రోజున గిటార్ లాంటి వాయిద్యాన్ని తయారుచేసుకోడానికి కలప కోసం అడవికి వెళ్ళాడు. హఠాత్తుగా కొంతమంది అతనిపై దాడి చేసి వలేసి పట్టుకుని గొలుసులతో బంధించి ఓడలో అట్లాంటిక్ మీదుగా అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి తీసుకుపోయారు. అక్కడ మాసా జాన్ వేలర్ అనే తోటల యజమానికి బానిసగా అమ్మేశారు. అతను కుంటా కింటేకు టోబీ అని పేరుపెట్టాడు. కుంటా కింటే తప్పించుకుని పారిపోవడానికి నాలుగుసార్లు విఫల యత్నం చేశాడు. అతనింక ఆ ప్రయత్నం చేయకుండా ఒక పాదాన్ని నరికేసారు. వైద్యవృత్తిలో ఉన్న వేలర్ సోదరుడు విలియం వేలర్ కొంత మానవత్వం ఉన్నవాడు. అతడు సోదరుడి చర్యను గర్హిస్తూ కుంటా కింటేకు వైద్యం చేసి అతడి ప్రాణాలు కాపాడాడు. సోదరునినుంచి తనే అతణ్ణి కొనుక్కుని గుర్రపు బండి నడపడానికి నియోగించాడు. తను ఏ విధంగానూ తన జన్మస్థానానికి వెళ్లలేనని గ్రహించిన కింటే పరాయి నేలలో ప్రవాసజీవితంతో క్రమంగా రాజీపడ్డాడు.

విలియం ఇంట్లో వంటమనిషిగా ఉన్న మరో బానిస బెల్ ను అతను పెళ్లి చేసుకున్నాడు. వారికి కూతురు పుట్టింది. ఆమెకు కిజ్జీ అని పేరుపెట్టారు. ఆమెకు వయసు వచ్చాక మాసా లీ అనే మరో బానిస యజమానికి విలియం అమ్మేశాడు. మాసా లీ బలాత్కారంగా తనను అనుభవించడంతో కిజ్జీ గర్భవతి అయింది. ఆమెకు కొడుకు పుట్టాడు. అతని పేరు చికెన్ జార్జి. అతను పెరిగి పెద్దయ్యాక మటిల్డా అనే మరో బానిసను పెళ్లిచేసుకున్నాడు. అతని మూడో కొడుకు టామ్. అతనికి ఇరేన్ అనే అమ్మాయితో పెళ్లయింది. వారి కుమార్తెలలో ఒకరైన సింథియాకు విల్ పామర్ అనే అతనితో వివాహం జరిగింది. వారి కూతురు బెర్తా, సైమన్ అలెగ్జాండర్ హేలీ అనే అతన్ని పెళ్లిచేసుకుంది. వారి కొడుకే రూట్స్ రచయిత ఎలెక్స్ హేలీ. కుంటా కింటేనుంచి అతనిది ఏడో తరం.

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE