వంతెనపై ముసలాయన
రోడ్డు ప్రక్కన దుమ్ముపట్టిన బట్టలతో ఇనుప ఫ్రేం కళ్ళద్దాలతో ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు.
నదిపై నిర్మించిన వంతెనపై కార్లు, ట్రక్కులు వెళుతున్నాయి. చాలా మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు రోడ్డు ఎగువకు వెళుతున్నారు. బండిని లాగలేక లాగలేక లాగుతున్న ఎద్దులకు సాయంగా సైనికులు చక్రాలను నెడుతున్నారు.
ఆ రోడ్డుపై ట్రక్కులు వేగంగా వెళుతున్నాయి. రైతులు రోజంతా పనిచేసి మోకాళ్ళ దాకా మట్టితో భారంగా ఆదుగులువేస్తున్నారు. కాని ఆ వృద్ధుడు మాత్రం ముందుకు కదలడం లేదు. అడుగు ముందుకు వేయలేనంతగా అలసిపోయి ఉన్నాడు.
నేనా వంతెనను దాటాలి. శత్రువు ఎంత వరకు ముందుకు వచ్చాడో పరిశీలించాలి. ఇదంతా చేశాక
మళ్లీ వచ్చేశా. ఇప్పుడా వంతెనపై ఎలాంటి బండ్లు పోవట్లేదు. నడచివెళ్లేవారు కూడా కొద్ది మందే వెళుతున్నారు.
కానీ ఆ వృద్ధుడు మాత్రం ఇంకా అక్కడే వున్నాడు.
“ఎక్కడ నుండి వస్తున్నావు ?” అతన్నడిగాను.
“శాన్‌కార్లోస్ నుండి' చెప్పాడతను. మెల్లగా నవ్వాడు.
అది తన స్వంతూరు. దాని గురించి చెపుతుంటే ఏదో తెలియని ఆనందం కనిపిస్తోందతని కళ్ళల్లో.
'నేను జీవాలను మేపుకుంటా' అతను వివరణ ఇచ్చుకున్నాడు.
'ఔనా?' అర్ధంకానట్లు చెప్పాను.
“నిజమే, నేను జీవాలను చూసుకుంటూ ఉన్నా. నేనొక్కడ్నే మా ఊరి నుండి వలసవచ్చిన చివరివాన్ని."
అతను గొర్రెల కాపరిగా గాని, ఎనుములు (గేదెలు) చూసేవానిగా గాని కనపడటంలేదు. నేనతన్ని
తేరిపార చూశా. బట్టలు మట్టికొట్టుకు పొతున్నాయి. కాయకష్టం చేసిన ఆయన ముఖం ముదురు గోధుమ
రంగులోకి మారిపోయింది. ' ఏ జీవాలను చూస్తుంటావు' అని అడిగా.
“ఒకటి కాదు రకరకాల జీవాలు" తలాడిస్తూ, నిట్టూర్పూ, విడుస్తూ “అన్నింటిని వదిలేశా" అన్నాడు.
నేను వంతెన వైపు తేరిపారచూస్తున్నా. నేను నా పనిలో వున్నా శత్రువు ఎప్పుడు ఎలా వస్తాడో తెలీడం
లేదు. ప్రతి శబ్దాన్ని నిశితంగా వింటూ, ఏ శబ్ధం రహస్యాన్ని మోసుకొస్తుందో ఎదురు చూస్తున్నా ముసలాయన మాత్రం అక్కడే కూర్చొని ఉన్నాడు.కదలడంలేదు.
“ఏఏ జీవాలు?" మళ్లీ అడిగా
“ఒకటి కాదు మూడు మొత్తం కలిపి .... 'రెండు గొర్లు, ఒక పిల్లి, నాలుగు జతల చిలుకలు'
“అయితే వాటిని వదిలేశావా?'"
“అవును, ఫిరంగిదళం దెబ్బకు కెప్టెన్ వచ్చి నన్ను వెళ్లిపోమన్నాడు."
“ నీ కుటుంబం?” దూరంగా వంతెన్ను దాటేస్తున్న రెండు ఎద్దుల బండ్లు చూస్తూ అడిగా.
“లేదు... జీవాలొక్కటే... పిల్లైతే పర్వాలేదు.
అదెట్లో తన్ను తాను చూసుకుంటుంది. మిగతావే, ఎలా బతుకుతాయో ఏమో ?"
"రాజకీయ పార్టీల్లో పనిచేయలేదా ?"
నాకు రాజకీయలంటే పడవు. నాకు 76 ఏళ్లు, ఇప్పటికే 12 కి.మీ. నడిచి వస్తున్నా ఇంక ముందుకు పోలేను.
“ఇది మంచి చోటు కాదు వుండేందుకు”
“టార్టసాకు పోయే పంగల్ రోడ్డు దాకా పోగలిగితే అక్కడ ట్రక్కులు దొరుకుతాయి”
“కొంచెం సేపుండి పోతా.ట్రక్కులెక్కడికిపోతాయి.” ?
“బార్సిలోనా దిక్కుపోతాయి.”
అలసిన కళ్ళతో భారంగా నావైపు చూశాడతను. అతని బాధలేవో చెప్పుకోవాలన్నట్లు ఉన్నాయి అతనిచూపులు.
' పిల్లైతే పరవాలేదు, దాన్ని గురించి దిగులులేదు. మిగతా జీవాలే, నువ్వేమంటావ్ ” వాటి గురించి
అడిగాడతను.
“అవేమన్నా నీతో పాటు వస్తాయా ?” అన్నా నేను.
“నువు చెప్పేది బాగుంది” వెటకారం ఉందా మాటలో.
“ఎందుకు రావు?” వంతెన్ను చూస్తూ అన్నాను.
“ఫిరంగి దళం ఏం చేస్తుందో ఏమో, ఆ ఫిరంగి దళం వస్తోందని పొమ్మన్నారు”.
“పావురం పంజరం తెరిచే వుందా?” నేను అడిగా.
“ తెరిచి పెట్టినాఅయితే అవి ఎగిరిపోతాయిలే'
“నిజమే, తప్పకుండా ఎగిరిపోతాయి. మిగతావే. వాటి గురించి ఆలోచించకుండా పోతే మంచిది”అన్నాడతను.
“నువ్వు ఇక్కడినుంచి వెళ్లితే నేను కూడా వెళతా”. "మెల్లగా వెళ్లడం మంచిది'.
“సరే నాయనా! నీ మేలు మరువవను నాయనా” అంటూ లేచి కాళ్లు అటూ ఇటూ తిప్పి మళ్లీ కూలబడ్డాడు.
సన్నగా గొనుక్కుంటూ, “నేను ఆ జీవాలు చూసుకుంటా వుంటే ”అన్నాడు.
అతని కోసం చేసేదేమీ లేదిక. వచ్చేది ఈస్టర్ ఆదివారం. గుడ్ ఫైడే తరువాత వస్తోంది. ఫాసిస్టులు ఎబ్రో వైపు తరుముకు వస్తున్నారు. మేఘాలు కమ్ముకొని వున్నాయి. యుద్ధ విమానాలు ఎగరడం లేదు. పిల్లులు
ఎలాగూ తమ్ముతాము రక్షించుకుంటాయన్నది వాస్తవం. ఇదే ఆ ముసలాయన అదృష్టం.
(ఎర్నెస్ట్ హెమింగ్‌వే రాసిన
“ యాన్ ఓల్డ్‌మ్యాన్ ఆన్‌ది బ్రిడ్జ్ "కథకు అనువాదం.)
పిళ్లా విజయ్
9490122229
Comments
Post a Comment