జీవితానందం
జీవితంలో సుఖాలకన్నా కష్టాలే ఎక్కువ.
అట్లాగని ఆనందంగా జీవించడం అంత కష్టమేమీ కాదు.
ఆనందమంటే కోటి రూపాయల లాటరీ గెలవటమో, ప్రభుత్వం నుండి బిరుదులు, అవార్డులు పొందటమో కాదు. క్రమేణా డబ్బూ, కీర్తి, సుఖాలు అన్నీ అలవాటుగా మారతాయి. అందువల్ల కష్టాలలో కూడా సుఖాన్ని అనుభవించాలంటే తృప్తిపడటం నేర్చుకోవాలి.
పరిస్థితులు ఇప్పుడున్న దానికన్నా ఛండాలంగా ఉంటే మన పరిస్థితి ఏమిటని ఆలోచించాలి.
జేబులో అగ్గిపుల్లలు భగ్గుమన్నాయనుకో, జేబులో గంధకం లేనందుకు ఆనందించు.
బంధువులు ఇంటి మీదకి దండెత్తి వస్తే, వచ్చింది. బంధువులే, పోలీసులు కాదుగా అనుకో.
వేలు తెగితే - కంట్లో గాయం కానందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకో.
మీ ఆవిడ గాన సాధన యింట్లో నీ వునికిని నరకం చేస్తే - ఎంత చెడ్డా అది గానమే కదా!
కుక్కలు మొరిగితేనే బాధ పడుతున్నావే, గాడిద నీ చెవిలో ఓండ్రిస్తే ఏం చేస్తావు?
బరువులు మోసే పశువ్వీ, గాడిదవీ కాదు. ఊరపందివీ, కుక్కవీ కాదు. ఈగవీ, దోమవీ, నల్లివీ కాదు. నువ్వో మనిషివైనందుకు సంతోషించు.
ఇవన్నీ సంతోషించవలసిన విషయాలు కావూ!
ఇంట్లో నే వున్నావు కదా. జైల్లో లేవే!
అప్పుల వాళ్లు నీ కాళ్లూ చేతులూ విరిచెయ్యలేదు.
పత్రికల వాళ్లు నీ రచనలు వేసుకొని డబ్బులు ఇస్తామనీ ఇవ్వలేదు. నీ రచనలైతే పది మంది కంట్లో పడ్డాయి గదా!
శఫరవా లేదు, ఊళ్లోనే వున్నావు. సైబీరియా ఎడారిలో లేవు కదా!
ఒక్క పన్నే నొప్పెడుతున్నది. నోరంతా పుచ్చిపోలేదు,
మునిసిపాలిటీ చెత్తబండిని లాగే గుర్రానివి కావు. నీకిష్టం లేని పేపరు చదవక్కర్లేదు.
ఒక్క భార్యే వున్నది. ముగ్గురు లేరు.
జైల్లో వేశారా, ఇంకా నయం ఖైదీల మధ్యే వున్నావు. తోడేళ్ల గుంపు మీదపడి పీక్కుని తినలేదు గదా!
బెత్తంతో బాదారా, ఫరవాలేదులే.ఇనప కడ్డీతో కాదుగా!
పెళ్లాం చని పోయిందా? నీకు ద్రోహం చేసిందా? దేశానిక్కాదుగా!
____ చెహోవ్
Comments
Post a Comment