మూడు జల్లెడ్ల పరీక్ష
మూడు జల్లెడ్ల పరీక్ష (Triple Filter Test)
చాణిక్యునిదగ్గరకు అతని మిత్రుడు వచ్చి "నీకు తెలుసా! నీ మిత్రుడు కౌశిక్ గురించి నేను ఒక విషయం విన్నాను” అని ఎంతో ఉత్సాహంగా ఏదో చెప్పబోయాడు.
వెంటనే అతన్ని చాణిక్యుడు ఆపి “నువు కౌశిక్ గురించి చెప్పబోయే ముందు ఒక విషయం అడిగనా?" అన్నాడు.
అడుగు అన్నాడు మిత్రుడు.
“నువు కౌశిక్ గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమేనని నీకు తెలుసా ?” అని అడిగాడు.
అందుకా స్నేహితుడు “లేదు, ఎవరో అంటుండగా విన్నాను” అని అన్నాడు.
“అంటే నీవు చెప్పబోయే విషయం నిజమో కాదో నీకు తెలీదన్న మాట” అని చాణిక్యుడు అన్నాడు.
పోనీ ” నువు నాకు చెప్పబోయే విషయం చాలా మంచి విషయమా ?” అని అడిగాడు చాణిక్యుడు,
“కాదు” అన్నాడు వచ్చిన స్నేహితుడు .
“అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు, అది కుడా నీకు ఖచ్చితంగా నిజమని తెలీని విషయం"అన్నాడు చాణిక్యుడు.
సరే కనీసం “నువు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా ? ” అని చాణిక్యుడు అడిగాడు.
“లేదు” అన్నాడు ఆ మిత్రుడు.
“అయితే నువు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?” అని అన్నాడు చాణిక్యుడు.
మిత్రుని ముఖం తెల్లబోయింది.
మళ్లీ చాణక్యుడు అతనితో "మన గురించి, మన వాళ్ళ గురించి ఏ విషయం వినాలన్నా పై మూడు ప్రశ్నలు వేసుకుపోవాలి.అప్పుడే చాలా
బంధాలు నిలబడతాయి."అన్నాడు.
Comments
Post a Comment